యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో విశాల్...

  • IndiaGlitz, [Monday,July 25 2016]

పందెంకోడి, పొగరు, భరణి, ఇంద్రుడు, పూజ, జయసూర్య వంటి సూపర్‌హిట్‌ చిత్రాల తర్వాత రాయుడుతో మరో సూపర్‌ డూపర్‌ హిట్‌ కొట్టిన మాస్‌ విశాల్‌ కొత్త చిత్రం కత్తిశండై ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణను జరుపకుంటోంది. 'రాయుడు' చిత్ర నిర్మాత జి.హరి హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ పతాకంపై ఈ భారీ స్టైలిష్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో త‌మ‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా జ‌గ‌ప‌తిబాబు విల‌న్‌గా న‌టిస్తున్నాడు. త‌రుణ్ అరోరో మ‌రో విల‌న్‌గా క‌న‌ప‌డ‌తారు. ప్ర‌స్తుతం ఈ సినిమా క‌నల్ కణ్ణ‌న్ నేతృత్వంలో యాక్ష‌న్ పార్ట్‌ను చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది. పూజ త‌ర్వాత క‌న‌ల్ కణ్ణ‌న్‌తో క‌లిసి వ‌ర్క్ చేస్తున్నాన‌ని హీరో విశాల్ త‌న ట్విట్ట‌ర్‌లో తెలియ‌జేశాడు. తెలుగు, తమిళంలో సినిమాను ఓకేసారి విడుదల చేయడానికి నిర్మాత హరి ప్లాన్ చేస్తున్నారు.

More News

శర్వానంద్ తో అక్ష..

రన్ రాజా రన్, మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు, ఎక్స్ ప్రెస్ రాజా వంటి సూపర్ హిట్ చిత్రాలతో హ్యాట్రిక్ సాధించిన హీరో శర్వానంద్ కథానాయకుడిగా, భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయనా చిత్రాల హీరోయిన్ లావణ్య త్రిపాఠి కథానాయికగా, ఛత్రపతి, డార్లింగ్, అత్తారింటికి దారేది...

ఇప్పుడు సూర్య అవకాశం ఇస్తాడంటారా?

సూపర్ స్టార్ రజనీకాంత్ తో కబాలి సినిమాను రూపొందించిన దర్శకుడు పా రంజిత్ కు విడుదలకు ముందు ఉన్న క్రేజే వేరు. విడుదల తర్వాత ప్రశంసలు ఎన్ని వచ్చాయో, విమర్శలు కూడా అన్నే వచ్చాయి.

మంచు హీరోతో ఆమె చేయడం లేదు....

`కంచె`తో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సీతాదేవిగా చెరగని ముద్రవేసుకున్న ప్రగ్యాజైశ్వాల్కు ఆమె నటనకు మంచి ప్రశంసలు లభించాయి. ఇప్పుడు నాగార్జున, రాఘవేంద్రరావు కాంబినేషన్ లో రానున్న'ఓం నమో వెంకటేశాయ' చిత్రంలో నటిస్తుంది.

అవసరాలతో రెజీనా..?

నటుడిగా, దర్శకుడిగా రాణిస్తున్న అవసరాల శ్రీనివాస్ ఇప్పుడు ఓ బాలీవుడ్ చిత్రంలో నటించనున్నాడు. `హంటర్` అనే బాలీవుడ్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై నవీన్ మేడారం తెరకెక్కిస్తారని అంటున్నారు.

కన్నడ రీమేక్ లో ఆది...

ఆగస్ట్ 5న `చుట్టాలబ్బాయి`గా తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి హీరో ఆది, తండ్రితో సాయికుమార్తో కలిసి రెడీ అయిపోయాడు. ఈ సినిమా తర్వాత హీరో ఆది తన తదుపరి చిత్రంగా కన్నడ ఘన విజయం సాధించిన `ఫస్ట్ ర్యాంక్ రాజ్` చిత్రాన్ని రీమేక్ లో నటించనున్నాడట.