విశాల్‌కి నిశ్చితార్థం

  • IndiaGlitz, [Monday,December 31 2018]

త‌మిళ‌, తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితుడైన న‌టుడు విశాల్ న‌డిగ‌ర్ సంఘం బిల్డింగ్ త‌ర్వాతే త‌న పెళ్లి అని తెలియ‌జేసిన సంగ‌తి తెలిసిందే. అన్న‌ట్లుగా 2019లో ఆ భ‌వ‌నం ప్రారంభం కానుంది. వ‌చ్చే ఏడాదిలోనే విశాల్ కూడా పెళ్లి చేసుకోబోతున్న‌ట్లు స‌మాచారం.

త్వ‌ర‌లో అనీషా అనే అమ్మాయితో హైద‌రాబాద్‌లో విశాల్ నిశ్చితార్థం జ‌ర‌గ‌బోతున్న‌ట్లు విశాల్ తండ్రి జి.కె.రెడ్డి ఓ ప్ర‌ముఖ త‌మిళ దిన ప‌త్రిక‌కు తెలియజేశారు. అంటే అమ్మాయిది హైద‌రాబాద్ అని అర్థ‌మ‌వుతుంది క‌దా!. విశాల్‌, హీరోయిన్ వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌ను పెళ్లి చేసుకోబోతున్న‌ట్లు వార్త‌లు విన‌ప‌డినా.. ఆ వార్త‌ల‌ను ఇద్ద‌రూ ఖండిస్తూనే వ‌స్తున్నారు.