హీరో విశాల్ బండారం బయటపెడతానంటున్న ఉద్యోగి!!
Send us your feedback to audioarticles@vaarta.com
సినిమాల సంగతేమో కానీ.. వివాదాల్లో విశాల్ ఎప్పుడూ ముందుంటున్నాడు. ముఖ్యంగా నడిగర్ సంఘం కార్యదర్శి, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఈ వివాదాలు మరింత ఎక్కువయ్యాయి. తాజాగా ఇప్పుడు ఈయన చుట్టూ మరో వివాదం నెలకొంది. వివరాల్లోకెళ్తే.. తన ఆఫీస్‌లో పనిచేసే రమ్య అనే మహిళా ఉద్యోగి ఆరు నెలల్లో 45 లక్షల రూపాయల మోసం చేసిందని భావించిన విశాల్ ఆమెపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే రమ్య ఈ వివాదంపై ఘాటుగా స్పందించింది. నిజానికి విశాల్ హీరో కాదు.. విలన్ అన్నారు రమ్య.
మీడియాతో వివాదంపై మాట్లాడిన రమ్య తనకే పాపం తెలియదన్నారు. అంతే కాకుండా విశాల్ చాలా సంవత్సరాలుగా గవర్నమెంట్‌ను మోసం చేస్తున్నారని, ప్రభుత్వానికి ఆయన టీడీఎస్ కట్టడం లేదని తెలిపారు. తన వద్ద అందుకు తగ్గ ఆధారాలున్నాయని ఆమె పేర్కొన్నారు. మరి దీనిపై విశాల్ అండ్ టీం ఎలా స్పందిస్తారో చూడాలి.
ఇక సినిమాల విషయానికి వస్తే విశాల్ దక్షిణాది నాలుగు భాషల్లో చక్ర అనే మూవీని సిద్ధం చేస్తున్నారు. రీసెంట్‌గా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను కూడా విడుదల చేశారు. శ్రద్దా శ్రీనాథ్ ఇందులో హీరోయిన్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com