అక్టోబర్ 18న డిటెక్టివ్?
Send us your feedback to audioarticles@vaarta.com
విశాల్ కథానాయకుడిగా నటించిన తమిళ చిత్రం తుప్పరివాలన్. ఈ నెల 14న విడుదలైన ఈ చిత్రం తమిళనాట మంచి వసూళ్లను సొంతం చేసుకుంది. అను ఇమ్మానియేల్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి మిస్కిన్ దర్శకత్వం వహించారు. తెలుగులో ఈ సినిమాని డిటెక్టివ్ పేరుతో విడుదల చేయబోతున్నారు. తొలుత ఈ సినిమాని అక్టోబర్ మొదటివారంలో విడుదల చేయాలనుకున్నారు. అయితే ఇప్పుడు అక్టోబర్ 18ని విడుదల తేదిగా ఫిక్స్ చేశారని తెలిసింది.
ఇదిలా ఉంటే.. విశాల్ నటించిన తొలి మలయాళ చిత్రం విలన్‌ని అక్టోబర్ 19న విడుదల చేయనున్నారు. మోహన్‌లాల్, హన్సిక, రాశి ఖన్నా ఇతర పాత్రల్లో నటించిన ఈ సినిమాని మలయాళంతో పాటు తమిళంలోనూ విడుదల చేయనున్నారు. ఇక సమంతతో విశాల్ నటిస్తున్న తమిళ చిత్రం ఇరుంబు తిరైని సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com