'ఒక్కడొచ్చాడు' రిలీజ్ పై విశాల్ క్లారిటీ...
Send us your feedback to audioarticles@vaarta.com
పందెంకోడి, పొగరు, భరణి, పూజ, రాయుడు వంటి హిట్ చిత్రాల తర్వాత తెలుగులో నేను చేస్తున్న మరో మంచి సినిమా 'ఒక్కడొచ్చాడు'. ప్రతి ఊళ్ళోనూ జరిగే అన్యాయాలను అరికట్టడానికి ఎవరో ఒకరు నడుం కట్టాలి. అలా నడుం కట్టిన హీరోగా విశాల్ ఒక్కడొచ్చాడు చిత్రంలో కనపడనున్నారు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో వుండే ఎంటర్టైన్మెంట్, రొమాన్స్, యాక్షన్ అన్నీ వుంటూనే ఒక పవర్ఫుల్, పర్పస్‌ఫుల్ ఫిలింగా 'ఒక్కడొచ్చాడు' రూపొందుతోంది.
తమిళంలో కత్తిసండై పేరుతో రూపొందుతోన్న ఈ సినిమా విజయదశమి నుండి పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. చివరకు ఈ సినిమాను డిసెంబర్లో విడుదల చేద్దామనుకున్నారు. కానీ తీరా ఇప్సుడు సినిమా డిసెంబర్లో కూడా విడుదల కావడం లేదట. సినిమాను సంక్రాంతి సందర్భంగా విడుదల చేయాలనుకుంటున్నట్లు హీరో విశాల్ ట్విట్టర్లో తెలయిజేశాడు. మరి తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలు సంక్రాంతి రేసులో ఉన్నారు. మరి ఇప్పుడు విశాల్ సినిమా తెలుగులో సంక్రాంతికి విడుదలవుతుందో లేదో చూడాలి...
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com