తన ఆరోగ్యం పై విశాల్ వివరణ...
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళ హీరో విశాల్ తలనొప్పితో బాధపడుతున్నాడని.. ఆ కారణంగా అమెరికాలోని ఓ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నాడని వార్తలు వినిపించాయి. దీని పై విశాల్ ట్విట్టర్ ద్వారా స్పందించారు.
తాను హాస్పిటల్లో జాయిన్ అయ్యానని వస్తున్న వార్తలు అవాస్తవమని.. తాను మైగ్రేన్‌తో బాధపడుతున్నానని, దాని నివారణకు చికిత్స తీసుకుంటున్నానని చెప్పిన విశాల్. మరికొన్నిరోజుల్లో చికిత్స పూర్తవుతుందని మార్చి మొదటివారంలో చెన్నై వచ్చేస్తానని తెలిపారు.
విశాల్ హీరోగా నటించిన అభిమన్యుడు సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. సినిమాను మార్చి లేదా ఏప్రిల్‌లో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments