విశాల్ క్యారెక్టర్....

  • IndiaGlitz, [Saturday,March 12 2016]

మాస్ ఇమేజ్ ఉన్న హీరో విశాల్ ఈ మధ్య కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్ చేస్తూ వరుస విజయాలు సాధిస్తున్నాడు. రీసెంట్ గా కథకళితో సక్సెస్ కొట్టిన ఈ హీరో లింగుస్వామి దర్శకత్వంలో పందెంకోడి సీక్వెల్ చేయాల్సింది కానీ కొన్ని కారణాలతో సినిమా ఆగిపోయింది. అయితే విశాల్ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తన నెక్ట్స్ సినిమాను మిస్కిన్ దర్శకత్వంలో స్టార్ట్ చేసేశాడు. ఈ చిత్రానికి తుప్పరివాలన్ అనే టైటిల్ పెట్టారు. ఆసక్తికరమైన విషయమేమంటే థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో విశాల్ డిటెక్టివ్ రోల్ చేస్తున్నాడట. ఇప్పటి వరకు విశాల్ చేయనటువంటి రోల్ ఇది. మరి మిస్కిన్ విశాల్ ను ఎలా చూపించనున్నాడో తెరపై చూడాల్సిందే...