ఆకట్టుకుంటున్న విశాల్ ‘చక్ర’ ట్రైలర్ ఒరిజినల్ సౌండ్ ట్రాక్..
Send us your feedback to audioarticles@vaarta.com
హీరో విశాల్, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా నటిస్తున్న సినిమా ‘చక్ర’. ఈ చిత్ర ట్రైలర్‌కు సంబంధించిన ఒరిజినల్ సౌండ్ ట్రాక్‌ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఎంఎస్ ఆనందన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై విశాల్ నిర్మిస్తున్న ఈ మూవీలో రెజీనా కసాండ్ర కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం పెచ్చుమీరిపోయిన డిజిటల్ క్రైమ్స్, బ్యాంక్ రాబరీ, హ్యాకింగ్ వంటి అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అయితే వీటన్నింటిపై ఇప్పటికే సినిమాలు రాగా.. సరికొత్తగా ఇప్పటి ట్రెండ్‌కు తగ్గట్టుగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్, ట్రైలర్ విడుదలై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉండటంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దీంతో సినిమాపై అంచనాలు కూడా భారీగా పెరిగాయి. ఈ చిత్రానికి యువన్ శంకర్‌రాజా అందిస్తున్న సంగీతం ఓ హైలైట్‌గా నిలవనుంది. నేడు ఇండిపెండెన్స్ డే కానుకగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఒరిజినల్ సౌండ్ ట్రాక్‌ని చిత్రబృందం విడుదల చేసింది. ఈ సౌండ్ ట్రాక్‌కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. కాగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments