ఆకట్టుకుంటున్న విశాల్ ‘చక్ర’ ట్రైల‌ర్ ఒరిజిన‌ల్ సౌండ్ ట్రాక్‌..

  • IndiaGlitz, [Saturday,August 15 2020]

హీరో విశాల్, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా నటిస్తున్న సినిమా ‘చక్ర’. ఈ చిత్ర ట్రైలర్‌కు సంబంధించిన ఒరిజినల్ సౌండ్ ట్రాక్‌ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఎంఎస్ ఆనందన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. విశాల్‌ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై విశాల్‌ నిర్మిస్తున్న ఈ మూవీలో రెజీనా కసాండ్ర కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం పెచ్చుమీరిపోయిన డిజిటల్ క్రైమ్స్, బ్యాంక్ రాబరీ, హ్యాకింగ్ వంటి అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అయితే వీటన్నింటిపై ఇప్పటికే సినిమాలు రాగా.. సరికొత్తగా ఇప్పటి ట్రెండ్‌కు తగ్గట్టుగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్, ట్రైలర్ విడుదలై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉండటంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దీంతో సినిమాపై అంచనాలు కూడా భారీగా పెరిగాయి. ఈ చిత్రానికి యువన్ శంకర్‌రాజా అందిస్తున్న సంగీతం ఓ హైలైట్‌గా నిలవనుంది. నేడు ఇండిపెండెన్స్ డే కానుకగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైల‌ర్ ఒరిజిన‌ల్ సౌండ్ ట్రాక్‌ని చిత్రబృందం విడుదల చేసింది. ఈ సౌండ్ ట్రాక్‌కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. కాగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.

More News

పాన్‌–ఇండియా ఫిల్మ్‌ ‘మ్యాడి (అనే) మాధవ్‌’ ఫస్ట్‌లుక్‌, ఇండిపెండెన్స్‌ డే స్పెషల్‌ సాంగ్‌ విడుదల

తెలుగు సహా తమిళం, మలమాళం, కన్నడ, హిందీ భాషల్లో ఆన్మే క్రియేషన్స్‌ పతాకంపై అనిల్‌కుమార్‌ నిర్మిస్తున్న పాన్‌–ఇండియా ఫిల్మ్‌ ‘మ్యాడి (అనే) మాధవ్‌’.

ఫైర్ యాక్సిడెంట్‌పై జ‌గ‌న్‌కు రామ్ ట్వీట్‌!!

ఎన‌ర్జిటిక్ హీరో రామ్ సినిమాల‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. కాంట్ర‌వ‌ర్సీల‌కు దూరంగా ఉంటారు.

సందేశాత్మ‌క చిత్రాన్ని అనౌన్స్ చేసిన మోహ‌న్‌బాబు

క‌లెక్ష‌న్ కింగ్ డా. మోహ‌న్‌భాబు 74వ స్వాతంత్ర్య దినోత్స‌వ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని త‌న కొత్త సినిమా వివ‌రాల‌ను ప్ర‌క‌టించారు.

'బీకామ్ లో ఫిజిక్స్' టీజర్ విడుదల

ఏడు చేపల కథ సినిమా తో అందరి దృష్టిని ఆకట్టుకొని  కమర్షియల్ సక్సెస్ అందుకున్న ద‌ర్శ‌కుడు శ్యామ్ జే చైత‌న్య తాజాగా

ఎస్పీ బాలు హెల్త్ బులిటెన్ విడుదల.. ఇంకా లైఫ్ సపోర్ట్ పైనే చికిత్స

గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంకు సంబంధించిన మరో హెల్త్ బులిటెన్‌ను చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రి కొద్ది సేపటి క్రితం విడుదల చేసింది.