'హర్లా ఫర్లా' సాంగ్‌తో ఆకట్టుకుంటోన్న విశాల్ 'చక్ర'
Send us your feedback to audioarticles@vaarta.com
యాక్షన్ హీరో విశాల్ హీరోగా ఎంఎస్ ఆనందన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం `చక్ర`. శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ఒక కీలకపాత్రలో హీరోయిన్ రెజీనా కసాండ్ర నటిస్తోంది. అత్యుత్తమ సాంకేతిక ప్రమాణాలతో రూపొందుతోన్నఈ చిత్రాన్ని విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై విశాల్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్ పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతూ సినిమాపై అంచనాలను పెంచింది. ఈ మూవీ యాక్షన్ హీరో విశాల్, మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్‌రాజా కాంబినేషన్‌లో వస్తోన్న 10వ చిత్రం కావడం విశేషం. తాజాగా ఈ చిత్రం నుండి యువన్ సంగీత సారథ్యం వహించిన `హర్లా ఫర్లా` సాంగ్`ని విడుదల చేసింది చిత్ర యూనిట్.
`నీ చూపుల్లోనే నాటీ గ్రాఫిటీ.. రైసైందే లబ్‌డబ్ హార్టుల్లోని గ్రావిటీ..తాకేనా ఆ మేఘాల్ని..నా వలన నీ నవ్వుల్నే..కొట్టి కొట్టి కన్ను చంపమాకలా..కిక్కు రేపుతున్న మత్తు మాటలా..కొత్త కొత్తగున్న బుట్టబొమ్మలా హర్లా..ఫర్లా` అంటూ జోష్‌ఫుల్‌గా సాగే ఈ పాటకి డా. చల్లా భాగ్యలక్ష్మి నేటి ట్రెండ్‌కి తగ్గట్లు సాహిత్యం అందించగా రంజిత్, సంజన కల్‌మంజి ఫుల్ ఎనర్జీతో ఆలపించారు. ప్రస్తుతం ఈ పాట సోషల్‌మీడియాలో మంచి రెస్పాన్స్ తో దూసుకుపోతుంది.
ప్రపంచాన్ని వణికిస్తున్న డిజిటల్ క్రైమ్స్ బ్యాంక్ రాబరీ, హ్యాకింగ్ నేపథ్యంలో సరికొత్త కథాకథనాలతో ఈ చిత్రం రూపొందుతోంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషలలో ఈ మూవీ విడుదలకానుంది.
యాక్షన్ హీరో విశాల్, శ్రద్దా శ్రీనాథ్, రెజీనా కసాండ్ర, మనోబాలా, రోబో శంకర్, కెఆర్ విజయ్, సృష్టిడాంగే తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి : బాలసుబ్రమనియం, సంగీతం: యువన్ శంకర్ రాజా, నిర్మాత: విశాల్,రచన- దర్శకత్వం: ఎం.ఎస్ ఆనందన్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments