హైకోర్టును ఆశ్రయించిన విశాల్
- IndiaGlitz, [Tuesday,April 30 2019]
హీరో విశాల్ అధ్యక్షుడుగా వ్యవహరిస్తున్న నిర్మాతల మండలిలో అవినీతి చోటు చేసుకుందని, నిర్మాతల మండలి కార్యవర్గం నిబంధనల ప్రకారం నడుచుకోలేదని కొందరు ఆరోపణలు చేశారు. దీనిపై స్పందించిన తమిళనాడు ప్రభుత్వం నిర్మాతల మండలి అధ్యక్షుడిని పదవి నుండి తొలగించి ఓ ప్రత్యేకాధికారిని నియమించింది. అయితే దీనిపై విశాల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించాలని విశాల్ అండ్ కో హైకోర్టును ఆశ్రయించింది.
ప్రస్తుత కార్యవర్గం కాలపరిమితి పూర్తయ్యిందని మే 1న సర్వసభ్య సమావేశాన్ని నిర్వహిస్తున్నామని మండలి అదాయ, వ్యయ వివరాలను సభ్యుల ముందు ప్రవేశ పెట్టి వారి ఆమోదం పొందుతామని పిటిషన్‌లో పెర్కొన్నారు. నిర్మాతల మండలిలో ఎలాంటి అవకతవకలు జరగలేదని, అలాగే ఈ సందర్భంలో ప్రత్యేకాధికారిణి నియమించడం సరికాదని కూడా ఈ పిటిషన్‌లో తెలిపారు. ఈ పిటిషన్‌ను అత్యవసర విచారణకు స్వీకరించాలని కోరారు. అందుకు సమ్మతించిన న్యాయమూర్తి ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరుపనున్నట్లు తెలిపారు.