విశాల్ - అనీషా విడిపోలేదు
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు వాడైనా తమిళనాడులో ఉంటూ స్టార్ హీరోగా ఎదిగిన విశాల్ పర్సనల్ లైఫ్‌లో పెళ్లి పెటాకులైందని ఈ మధ్య వార్తలొచ్చాయి. ఇంకా పెళ్లి పీటల మీదకు కూడా ఎక్కని అతని నిశ్చితార్థం కేన్సిల్ అయిందని, అమ్మాయి అనీషా తన ఇన్‌స్టా అకౌంట్ నుంచి విశాల్ ఫొటోలన్నీ డిలీట్ చేయడమే దానికి స్పష్టమైన ఆధారమని అంతా అన్నారు.
శరత్‌కుమార్ తనయ వరలక్ష్మికీ, విశాల్కూ మధ్య ఉన్న ప్రేమ కారణంగానే విశాల్-అనీషా రెడ్డి జంట విడిపోయిందని కూడా అన్నారు. అయితే వాటన్నిటికీ ఫుల్స్టాప్ పెడుతూ అనీషా పెట్టిన పోస్ట్ వైరల్ అయింది. తాము విడిపోయినట్టు వచ్చిన వార్తలను అటు విశాల్‌గానీ, ఇటు అనీషాగానీ అసలు ఖండించలేదు. దానికి బదులుగా తాను, విశాల్‌తో ఉన్న ఫొటో పెట్టి అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పింది అనీషా అల్లారెడ్డి.
``హ్యాపీ బర్త్ డే స్టార్. నువ్వు వెలగడానికే పుట్టావు. వెలుగుతూనే ఉంటారు. నీ సౌందర్యం గొప్పది. ఎన్నో ఘనకీర్తులు నా దారివెంట నిన్ను చేరుతాయి. నీమీద నాకు నమ్మకం ఉంది. ఎప్పటికీ ప్రేమిస్తూ`` అని ఆమె విశాల్‌కు తన పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసింది.
నాగార్జున, విశాల్ ఒకేరోజు పుట్టినరోజును జరుపుకుంటున్నారు. నాగార్జునకు ఇది 60వ పుట్టినరోజు కాగా, విశాల్‌కు ఇది 42వ పుట్టినరోజు. ఆయనకు బ్యాచ్‌లర్‌గా ఇదే ఆఖరి పుట్టినరోజు కానుంది. నడిగర్ సంఘం కమ్యూనిటీ హాల్లో త్వరలోనే విశాల్ - అనీషా రెడ్డి పెళ్లి జరగనుంది. అనీషా వైజాగ్ అమ్మాయి. ఇరు వైపు కుటుంబాలు నచ్చి విశాల్-అనీషాకు పెళ్లి నిర్ణయించారు. వారి మధ్య చిన్నపాటి ప్రేమ కూడా ఉంది. అనీషా కూడా సినిమాల్లో అడపాదడపా కనిపించింది.
విశాల్ ప్రతి పుట్టినరోజుకూ విష్ చేసే వరలక్ష్మి ఈసారి అతనికి పుట్టిన రోజు శుభాకాంక్షలు సోషల్ మీడియాలో చెప్పలేదు. వీరిద్దరిదీ మంచి స్నేహం అని విశాల్ చాలా సార్లు మీడియాతో చెప్పారు. అయితే విశాల్ నిశ్చితార్థం జరిగిన తర్వాత వీరిద్దరి మధ్య పూర్వం ఉన్నంత స్నేహం కనిపించడం లేదన్నది వాస్తవం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments