హీరో విశాల్ తండ్రికి కరోనా పాజిటివ్.. ఆయనకు సాయం చేస్తూ..
- IndiaGlitz, [Sunday,July 26 2020]
ఇప్పటి వరకూ బాలీవుడ్‌పై పంజా విసిరిన కరోనా తాజాగా కోలీవుడ్‌కూ పాకింది. ఇప్పటికే కోలీవుడ్‌కి చెందిన అర్జున్ కూతురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.. తాజాగా హీరో విశాల్ తండ్రికి కూడా కరోనా పాజిటివ్ అంటూ వార్తలొచ్చాయి. ఈ వార్తలు నిజమో.. అబద్ధమో తెలియక ఆయన అభిమానులు సందిగ్ధంలో ఉండిపోయారు. అయితే ఆ వార్తలు నిజమేనని విశాల్ వెల్లడించాడు. తొలుత తన తండ్రి కరోనా బారిన పడ్డారని... ఆయనకు సహాయం అందిస్తూ తాను కూడా కరోనా లక్షణాలతో బాధపడుతున్నట్టు విశాల్ స్వయంగా వెల్లడించాడు. తన మేనేజర్‌కు కూడా కరోనా లక్షణాలున్నట్టు విశాల్ తెలిపాడు. తామంతా ఆయుర్వేదిక్ మెడిసిన్ తీసుకుంటున్నట్టు వెల్లడించాడు.
‘‘అవును.. అదంతా నిజమే. మా నాన్నకి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఆయనకి సహాయం చేసే క్రమంలో నాకు కూడా అవే లక్షణాలు కనిపించాయి. జ్వరం, జలుబు, దగ్గు వంటి కరోనా లక్షణాలతో బాధపడుతున్నాము. నా మేనేజర్లో కూడా అవే లక్షణాలు కనిపించాయి. మేమంతా ఆయుర్వేదిక్ మెడిసెన్ తీసుకుంటున్నాము. ఒక వారంలో ప్రమాదం నుంచి బయటపడతాము. ప్రస్తుతానికి మా ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను’’ అని విశాల్ తన ట్వీట్లో పేర్కొన్నారు.