జూన్‌ 1న విశాల్‌ 'అభిమన్యుడు'

  • IndiaGlitz, [Monday,May 21 2018]

మాస్‌ హీరో విశాల్‌ కథానాయకుడిగా విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ పతాకంపై పి.ఎస్‌.మిత్రన్‌ దర్శకత్వంలో తమిళ్‌లో రూపొందిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'ఇరుంబుతెరై'. ఇటీవల తమిళనాడులో విడుదలైన ఈ సినిమా సూపర్‌ డూపర్‌ హిట్‌ అయింది. ఈ చిత్రాన్ని 'అభిమన్యుడు' పేరుతో ఎం.పురుషోత్తమన్‌ సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ పతాకంపై జి.హరి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. జూన్‌ 1న 'అభిమన్యుడు' చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.

ఈ సందర్భంగా మాస్‌ హీరో విశాల్‌ మాట్లాడుతూ - ''తమిళ్‌లో 'ఇరుంబుతెరై' సినిమా చాలా పెద్ద హిట్‌ అయింది. చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. నా కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌ అయింది. 'అభిమన్యుడు' చిత్రానికి ఆంధ్రపద్రేశ్‌, తెలంగాణాల్లో కూడా తమిళ్‌లాగే ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తుందని, తెలుగులో కూడా నా కెరీర్‌నే బిగ్గెస్ట్‌హిట్‌ చిత్రంగా నిలుస్తుందని ఆశిస్తున్నాను'' అన్నారు.

హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ అధినేత జి.హరి మాట్లాడుతూ ''జూన్‌ 1న మా 'అభిమన్యుడు' చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం. మే 25న ఆడియో ఫంక్షన్‌ను చాలా గ్రాండ్‌గా చేయబోతున్నాం. తమిళ్‌లో ఇటీవల విడుదలైన 'ఇరుంబుతెరై' చిత్రం భారీ ఓపెనింగ్స్‌ సాధించడమే కాకుండా విశాల్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌ చితంగా నిలిచింది. తెలుగులో ఈ చిత్రం తమిళ్‌ కంటే పెద్ద విజయాన్ని సాధిస్తుందన్న నమ్మకం నాకు ఉంది'' అన్నారు.

మాస్‌ హీరో విశాల్‌, సమంత, యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌తోపాటు భారీ తారాగణం ఈ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: యువన్‌ శంకర్‌రాజా, సినిమాటోగ్రఫీ: జార్జి సి. విలియమ్స్‌, ఎడిటింగ్‌: రూబెన్‌, ఫైట్స్‌: దిలీప్‌ సుబ్బరాయన్‌, ఆర్ట్‌: ఉమేష్‌ జె.కుమార్‌, మాటలు: రాజేష్‌ ఎ.మూర్తి, నిర్మాత: జి.హరి, దర్శకత్వం: పి.ఎస్‌.మిత్రన్‌.

More News

'ప్రేమకథా చిత్రమ్' మ్యాజిక్ రిపీట్ అవుద్దా?

‘ఎస్‌.ఎం.ఎస్‌’ ( శివ మనసులో శృతి) చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన క‌థానాయ‌కుడు సుధీర్ బాబు. ఆ త‌రువాత‌ 'ప్రేమకథా చిత్రమ్', 'ఆడు మగాడ్రా బుజ్జి', 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని', 'మోసగాళ్ళకు మోసగాడు'.

ఫ్యాక్షన్ లీడర్‌గా ఎన్టీఆర్?

యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఉత్తరాది భామ పూజా హెగ్డే జంటగా ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో

 సస్పెన్స్ థ్రిల్లర్ గా 'లా' (లవ్ అండ్ వార్)

సమాజంలో ప్రతి మనిషి కి చట్టం, న్యాయానికి లోబడే జీవించాలి. అలా జీవిచడం లేదంటే జరిగే మలుపులు ఎలా ఉంటాయి అనే కథాంశంతో రూపొందిన మూవి 'లా'.. "లవ్ అండ్ వార్" అనేది ఉపశీర్షిక.

'అమ్మ‌మ్మ‌గారిల్లు' ..ఈనెల 25న విడుద‌ల‌

శ్రీమ‌తి స్వ‌ప్న స‌మ‌ర్ప‌ణ‌లో స్వాజిత్ మూవీస్ బ్యాన‌ర్ లో నాగ‌శౌర్య‌, బేబి షామిలి జంట‌గా కె.ఆర్ స‌హా నిర్మాత‌గా రాజేష్  నిర్మిస్తోన్న చిత్రం `అమ్మమ్మగారిల్లు`.

క‌బీర్ లాల్ ద‌ర్శ‌క‌త్వంలో స్పానిష్ మూవీ 'జూలియాస్ ఐస్' రీమేక్‌

న‌రుడా ఓ న‌రుడా ఏమి కోరిక అంటూ అల‌నాటి అందాల ముద్దుగుమ్మ రంభ, నంద‌మూరి బాల‌కృష్ణ తో ఆడిపాడిన పాట తెలుగు సినిమా వున్నంత‌కాలం గుర్తుండిపోయేలా చిత్రీక‌రించిన విష‌యం తెలిసిందే..