లండన్ బాబుల వీసా కష్టాలు..
Send us your feedback to audioarticles@vaarta.com
రక్షిత్, స్వాతి జంటగా రూపొందిన చిత్రం `లండన్ బాబులు`. చిన్నికృష్ణ దర్శకుడు. మారుతి నిర్మాత. మారుతి టాకీస్ పతాకంపై రూపొందుతోంది. ఈ చిత్రం ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో బుధవారం జరిగింది. హీరో నిఖిల్ ముఖ్య అతిథిగా పాల్గొని ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా
నిఖిల్ మాట్లాడుతూ ``చిన్నికృష్ణతో వీడుతేడా సినిమాలో చేశాను. తను నిజాయితీతో కష్టపడతాడు. చాలా సరదాగా ఉంటాడు. జెన్యూన్ గై. స్వాతి సినిమా ఓకే చేసిందంటేనే సినిమాలో చాలా మంచి విషయం ఉన్నట్టే లెక్క. చిన్నికృష్ణ ఈ సినిమాతో పెద్ద హిట్ చవిచూడాలి. ట్రైలర్ చాలా బావుందని అన్నారు. ట్రైలర్ ప్రామిసింగ్‌గా ఉందని దర్శకుడు పరుశురామ్ తెలిపారు.
ట్రైలర్ బావుంది. వీడు తేడా సినిమాకు నేను చిన్నికృష్ణ దగ్గర అసోసియేట్‌గా పనిచేశాను. సినిమా పెద్ద సక్సెస్ కావాలని సుధీర్ వర్మ తెలిపారు.
అనిల్ రావిపూడి మాట్లాడుతూ..సినిమా బావుటుందనే నమ్మకం ఉంది. నా సినిమా కథ విని ఆయన చాలా బావుందన్నారు. ఈ ట్రైలర్ చూసి నేను చెబుతున్నాను సినిమా హిట్ అవుతుందన్నారు.
కొత్త బంగారులోకం నుంచి నాకు చిన్నికృష్ణ పరిచయం. ఈ సినిమా ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాలని శ్రీకాంత్ అడ్డాల చెప్పారు.
స్వాతి మాట్లాడుతూ..ఇది రీమేక్ చిత్రం. హీరో కొత్త అబ్బాయి అయినా చాలా బాగా నటించాడని అంది. రక్షిత్ మాట్లాడుతూ..`మారుతిగారికి చాలా థాంక్స్, స్వాతి సీనియర్ అయినా చక్కగా సపోర్ట్ చేశారని తెలిపారు.
చిన్నికృష్ణ మాట్లాడుతూ..సినిమాలకు దూరంగా వైజాగ్‌లో ఉన్న నన్ను పిలిచ మారుతిగారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. పావుగంట కథ విని నిఖిల్ నాకు వీడుతేడా అవకాశమిచ్చారు. స్వీట్‌మేజిక్ వాళ్ల అబ్బాయిని ఇంట్రడ్యూస్ చేయడం ఆనందంగా ఉంది. మంచి హీరోని పరిచయం చేశాననే ఆనందం నాకు ఎప్పుడూ ఉంటుందన్నారు.
మారుతి మాట్లాడుతూ..ఆండవన్ కట్టళై అనే తమిళ సినిమాను స్వీట్ మ్యాజిక్ ప్రసాద్‌గారు చూసి, నన్ను చూడమన్నారు. ఫక్తు కమర్షియల్ సినిమా అని అనుకున్నా. కానీ విజయ్ సేతుపతి చాలా ప్యాషన్‌తో చేశారని ఆయనతో మాట్లాడితే తెలిసింది. ప్రసాద్‌గారి జెన్యూనిటీ నచ్చింది. రక్షిత్‌కి చాలా మంచి సినిమా అవుతుంది. పాస్‌పోర్ట్ కోసం పడే తిప్పల్ని గురించి చెప్పాం. స్వాతిలో మంచి రైటర్, డైరక్టర్ కూడా ఉన్నారు. ఆవిడకి కథ నచ్చి చేస్తానని అనగానే చాలా హ్యాపీగా అనిపించింది. ఈ సినిమా రెగ్యులర్‌గా ఉండదు. మామూలుగా నేను నిర్మించే సినిమాలకు పేరు వేసుకోవడానికి చాలా ఆలోచిస్తాను. కానీ నాకు బాగా నచ్చడంతో వేసుకున్నాను. చిన్నికృష్ణకు మంచి సినిమా అవుతుందని చెప్పారు.
ఆలీ, మురళిశర్మ, రాజారవీంద్ర, జీవా, ధనరాజ్, సత్య, అజయ్ ఘోష్, ఈరోజోల్లో సాయి, వేణు, సత్యకృష్ణ తదితరులు నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ - శ్యామ్ కె నాయుడు, మ్యూజిక్ - కె, ఎడిటర్ - ఎస్.బి.ఉద్దవ్, కో డైరెక్టర్ - కొప్పినీడి పుల్లారావు, ఆర్ట్ డైరెక్టర్ - విఠల్ కోసనంఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - కిరణ్ తలసిల, దాసరి వెంకట సతీష్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments