Virgin Story : ఆహాలో దుమ్మురేపుతోన్న ‘‘వర్జిన్ స్టోరీ ’’, అన్ని లక్షల వ్యూసా..?
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా తర్వాత వ్యవస్థలో చెప్పలేనన్ని మార్పులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం కొందరికే పరిమితమని అనుకుంటున్న వేళ .. ప్రభుత్వోద్యోగులు కూడా ఇంటి నుంచే పనిచేశారు. అలాగే డిజిటల్ లావాదేవీలు, ఆన్‌లైన్ కొనుగోళ్లు పెరిగాయి. విద్యా వ్యవస్థలోనూ ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇక కరోనా కారణంగా తీవ్రంగా ప్రభావితమైన రంగం వినోద పరిశ్రమ. అంతకుముందు కుటుంబ సభ్యులతో కలిసి థియేటర్లకు పరిగెత్తేవారు ప్రేక్షకులు. అయితే ఆ సమయంలో ఓటీటీ మార్కెట్ వేగంగా విస్తరించింది. చాలా తక్కువ మొత్తం సబ్‌స్క్రిప్షన్ ఫీజులకే ప్రపంచ నలుమూలలా వున్న అన్ని రకాల వినోదం అరచేతిలోకి వచ్చి చేరింది. దీంతో ఎంతో కంటెంట్ వుంటే తప్పించి థియేటర్ వైపు కన్నెత్తి చూడటం లేదు ప్రేక్షకులు. దీంతో ప్రతి వారం ఓటీటీలో ఏమేం రిలీజ్ అవుతున్నాయో ప్రత్యేకంగా ప్రకటిస్తున్నారు మేకర్స్.
ఓటీటీ మార్కెట్‌లో దూసుకెళ్తున్న ఓటీటీ:
ప్రస్తుతం ఓటీటీ వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలు అన్నట్లు దూసుకుపోతోంది. బడా నిర్మాణ సంస్థలు, కార్పోరేట్ కంపెనీలు ఈ రంగంలోకి అడుగుపెట్టడం, ప్రేక్షకులు కూడా కోవిడ్ భయం.. టిక్కెట్ల ధరల కారణంగా ఓటీటీలకు మొగ్గుచూపుతుండడంతో వీటి మార్కెట్ రోజురోజుకీ పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే ఓటీటీ సంస్థల పోటీ కూడా అదే స్థాయిలో పెరిగింది. ఈ నేపథ్యంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఈ రంగంలో వున్న వృద్ధిని గమనించి తెలుగులో మొట్టమొదటి సారిగా ‘‘ఆహా’’ పేరిట ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ను ప్రారంభించారు. ఇప్పటికే వెబ్ సిరీస్‌లు, సినిమాలు, షోలతో ‘‘ఆహా’’ దూసుకెళ్తోంది.
థియేటర్‌లో వర్జిన్ స్టోరీని పట్టించుకోని జనం:
ప్రస్తుతం ధియేటర్‌లలోకి వచ్చిన కొద్దిరోజుల తర్వాత సినిమా ఓటీటీలోకి కూడా ఎంట్రీ ఇస్తోంది. ఈ రెండింటిలో సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా మేకర్స్ చెబుతున్నారు. ఇదే సమయంలో ఇప్పుడు కొత్త ట్రెండ్ ఒకటి నడుస్తోంది. థియేటర్‌లో బ్లాక్ బస్టర్స్‌గా నిలిచిన సినిమాలు ఓటీటీలలో ఫట్ అయితే.. థియేటర్‌లలో ఫ్లాప్ అయిన సినిమాలు , ఓటీటీలో మాత్రం తిరుగులేని వ్యూయర్‌షిప్‌ను సాధిస్తున్నాయి. ఇప్పుడు ఈ రెండో రకం కేటగిరీలో వస్తుంది ‘‘వర్జిన్ స్టోరీ’’. ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్ నిర్మించిన ఈ సినిమాను 2022 ఫిబ్రవరిలో విడుదల చేశారు. అయితే ఆ సమయంలో ఈ చిన్న సినిమాలను చూసేందుకు ప్రేక్షకులు అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదు. దీంతో చాలా మందికి వర్జిన్ స్టోరీ వచ్చినట్లు కూడా తెలియలేదు.
ఏప్రిల్ 21 నుంచి ఓటీటీలోకి వర్జిన్ స్టోరీ :
అయితే ఏప్రిల్ 21 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమా సంచలనం సృష్టిస్తోంది. అత్యంత వేగంగా పది మిలియన్ల వ్యూస్ అందుకుని దూసుకెళ్తోంది. థియేటర్‌లో నిరాశ పరిచిన తమ సినిమాను ఓటీటీలో జనం ఆదరిస్తూ వుండటంతో వర్జిన్ స్టోరీ చిత్ర యూనిట్ హర్షం వ్యక్తం చేస్తోంది. ప్రదీప్ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విక్రమ్ సాహిదేవ్ హీరోగా నటించగా.. సౌమిక పాండ్యన్, రిషిక ఖన్నా హీరోహీరోయిన్లుగా చేశారు. రామలక్ష్మీ క్రియేషన్స్ బ్యానర్‌పై లగడపాటి శిరీష, శ్రీధర్ నిర్మించారు. మరి ఈ సినిమాను థియేటర్‌లో మిస్ అయ్యుంటే వెంటనే ఓటీటీలో చూసేయ్యండి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments