విరాట‌ప‌ర్వంలో ముందు వేరే హీరోను అనుకున్నారట..

  • IndiaGlitz, [Monday,June 08 2020]

నీదినాది ఒకే క‌థ సినిమాతో ద‌ర్శ‌కుడిగా మారిన వేణు ఊడుగుల ఇప్పుడు విరాట‌ప‌ర్వం చిత్రాన్ని తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో రానా, సాయిప‌ల్ల‌వి హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ప్రియ‌మ‌ణి కీల‌క పాత్ర‌లో న‌టిస్తుంది. ఈ సినిమాకు క‌థ‌ను రాసుకునేట‌ప్పుడు డైరెక్ట‌ర్ వేణు మైండ్‌లో రానాను అనుకోలేదట‌. త‌మిళం, తెలుగులో మంచి మార్కెట్ ఉన్న కార్తిని హీరోగా అనుకున్నాడ‌ట‌. కానీ కార్తికి తెలుగులో పెద్ద మార్కెట్ లేక‌పోవ‌డంతో రానాను తీసుకోవాల‌ని అనుకున్నాడ‌ట‌. రానాను క‌లిసి క‌థ చెప్ప‌గానే రానా ఎక్కువ టైమ్ తీసుకోకుండా డేట్స్ ఇచ్చేశాడ‌ట‌.

అలా కార్తిస్థానంలో రానా హీరోగా వ‌చ్చాడు. సాయిప‌ల్ల‌వి, ప్రియ‌మ‌ణి ఇందులో న‌క్స‌లైట్ పాత్ర‌ల్లో న‌టిస్తుంటే రానా పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌నిపిస్తాడ‌ని అంటున్నారు. రీసెంట్‌గా ప్రియ‌మ‌ణి పోషిస్తున్న భార‌త‌క్క పాత్ర‌కు సంబంధించిన లుక్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. కొంత మేర‌ చిత్రీక‌ర‌ణ మిగిలి ఉంది. అయితే లాక్‌డౌన్ స‌మ‌యంలో సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను పూర్తి చేయ‌డంలో చిత్ర యూనిట్ బిజీగాఉంద‌ట‌. సురేష్‌బాబు, సుధాక‌ర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

More News

రాజ‌మౌళి, త్రివిక్ర‌మ్‌, కొర‌టాల శివ, పూరి

సినిమా ప‌రిశ్ర‌మ‌లో రెండు త‌ర‌గ‌తులు ఎప్ప‌టికీ ఉంటాయి. అందులో కొంద‌రు యాక్టివ్ మెంబ‌ర్స్ ఉంటే.. ఎక్కువ శాతం నాన్ యాక్టివ్ మెంబ‌ర్స్ ఉంటారు.

తొందర‌‌పడొద్దంటున్న బ‌న్నీ... ఇన్‌స్టాలో బ‌న్నీ హ‌వా

క‌రోనా ఎఫెక్ట్‌తో కొనసాగుతున్న లాక్‌డౌన్ వ‌ల్ల సినిమాల షూటింగ్స్‌కు తెలంగాణ ప్ర‌భుత్వం ఓకే చెప్పింది. విధి విధానాలు ప్ర‌క‌టించాల్సి ఉంది.

తెలంగాణ‌లో షూటింగ్స్‌కు కేసీఆర్ గ్రీన్ సిగ్న‌ల్‌

కోవిడ్ 19 మార్గదర్శకాలు, లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ రాష్ట్రంలో సినిమా, టివి కార్యక్రమాల షూటింగులు కొనసాగించుకోవడానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అనుమతి ఇచ్చారు.

వెబ్‌ ఆడియన్స్‌ మనసులు గెలిచి పెద్ద విన్నర్‌గా నిలిచిన 'లూజర్‌'

భారతదేశంలోనే అత్యధికంగా ఒరిజినల్‌ వెబ్‌ సిరీస్‌లు/కంటెంట్‌ ప్రొడ్యూస్‌ చేస్తున్న డిజిటల్‌ ఫ్లాట్‌ఫార్మ్‌ 'జీ 5'. ఇందులో 100కు పైగా ఒరిజినల్‌ వెబ్‌ సిరీస్‌లు ఉన్నాయి.

మ‌రోసారి ‘ఢీ’ కొట్ట‌బోతున్నారా..?

మంచు విష్ణు హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందిన కమర్షియల్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘ఢీ’. విష్ణుకు తొలిసారి బ్రేక్ దక్కిన చిత్రమిది. తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో