విరాటపర్వంలో ముందు వేరే హీరోను అనుకున్నారట..
- IndiaGlitz, [Monday,June 08 2020]
నీదినాది ఒకే కథ సినిమాతో దర్శకుడిగా మారిన వేణు ఊడుగుల ఇప్పుడు విరాటపర్వం చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో రానా, సాయిపల్లవి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రియమణి కీలక పాత్రలో నటిస్తుంది. ఈ సినిమాకు కథను రాసుకునేటప్పుడు డైరెక్టర్ వేణు మైండ్‌లో రానాను అనుకోలేదట. తమిళం, తెలుగులో మంచి మార్కెట్ ఉన్న కార్తిని హీరోగా అనుకున్నాడట. కానీ కార్తికి తెలుగులో పెద్ద మార్కెట్ లేకపోవడంతో రానాను తీసుకోవాలని అనుకున్నాడట. రానాను కలిసి కథ చెప్పగానే రానా ఎక్కువ టైమ్ తీసుకోకుండా డేట్స్ ఇచ్చేశాడట.
అలా కార్తిస్థానంలో రానా హీరోగా వచ్చాడు. సాయిపల్లవి, ప్రియమణి ఇందులో నక్సలైట్ పాత్రల్లో నటిస్తుంటే రానా పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తాడని అంటున్నారు. రీసెంట్గా ప్రియమణి పోషిస్తున్న భారతక్క పాత్రకు సంబంధించిన లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. కొంత మేర చిత్రీకరణ మిగిలి ఉంది. అయితే లాక్డౌన్ సమయంలో సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేయడంలో చిత్ర యూనిట్ బిజీగాఉందట. సురేష్‌బాబు, సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.