విరాట్ రాజ్' హీరోగా 'సీతామనోహర శ్రీరాఘవ' చిత్రం

  • IndiaGlitz, [Wednesday,August 25 2021]

వెండితెర కు మరో నట వారసుడు పరిచయం అవుతున్నారు. అతని పేరు 'విరాట్ రాజ్'. అలనాటి అందాల హీరో హరనాథ్ సోదరుడు వెంకట సుబ్బరాజు మనుమడు ఈ 'విరాట్ రాజ్' ఈరోజు అతని పుట్టినరోజు. ఈ సందర్భంగా చిత్రం హీరోను, పేరును పరిచయం చేస్తూ రూపొందించిన ప్రచార చిత్రాలను,వీడియోను అతని నట శిక్షకుడు శ్రీ సత్యానంద్ గారు విడుదల చేసి ఆశీస్సులు అందించారు. చిత్రం పేరు 'సీతామనోహర శ్రీరాఘవ'. విరాట్ రాజ్ పరిచయ ప్రచార చిత్రాలను పరిశీలిస్తే పెద తాత హరనాథ్ స్ఫురణకు వస్తారు. ఓ చిత్రంలో అందంగా,క్యూట్ గా కనిపిస్తున్న విరాట్ రాజ్ మరో ప్రచార చిత్రం లో గన్ చేతబట్టి యాక్షన్ లోక్ వెంకట సుబ్బరాజు గారు 'భక్త తుకారాం, కోడె నాగు, రిక్షా రాజి' వంటి అలనాటి పలు చిత్రాలలో కీలక పాత్రలలో నటించారు. ఇటు తాత వెంకట సుబ్బరాజు, అటు పెద తాత హరనాథ్ గారు స్ఫూర్తి తో ఈ ‘సీతామనోహర శ్రీరాఘవ' చిత్రం ద్వారా హీరోగా పరిచయం కావడం సంతోషంగా ఉంది. ఇది సరైన చిత్రంగా భావిస్తున్నాను. మీడియా, చిత్ర పరిశ్రమలోని పెద్దలు, ప్రేక్షకులు ఆశీస్సులు కావాలని కోరుకుంటున్నాను అన్నారు 'విరాట్ రాజ్'

ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్న దుర్గా శ్రీ వత్సస.కె. మాట్లాడుతూ...'హీరోగా విరాట్ రాజ్ పరిచయం అవుతున్న ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా నేనూ పరిచయం కావడం సంతోషంగా ఉంది. ఒక ఇమేజ్ కు మాత్రమే పరిమితం కాకుండా ఈ చిత్రం ద్వారా భిన్నమైన చిత్రాలకు సరితూగే ఇమేజ్ ను 'విరాట్ రాజ్' స్వంతం చేసుకునేలా ఈ చిత్రం కథను సిద్ధం చేయటం జరిగింది. చిత్రం పేరు ‘సీతామనోహర శ్రీరాఘవ'. పేరు వెనుక కథ ఏమిటన్నది ప్రస్తుతానికి గోప్యంగా ఉంచుతున్నాము. సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ చిత్రంగా, మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం పలు భావోద్వేగాల సమ్మిళితం అన్నారు దర్శకుడు. కె.జి.ఎఫ్. 2, సలార్ చిత్రాలకు సంగీతం సమకూరుస్తున్న 'రవి బస్ రుర్' ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.

వెండితెరకు మరో నట వారసుడు ను తమ 'వందన మూవీస్' చిత్ర నిర్మాణ సంస్థ ద్వారా పరిచయం చేయటం చాలా ఆనందం గా ఉంది అన్నారు చిత్ర నిర్మాత సుధాకర్.టి. సెప్టెంబర్ లో షూటింగ్ ప్రారంభం అవుతుందని, చిత్రంలో ఇతర తారాగణం, సాంకేతిక నిపుణులు ఎవరన్నది మరోసారి ప్రకటించటం జరుగుతుందని అన్నారు.

ఈ చిత్రానికి సంగీతం: రవి బస్ రుర్ ; పాటలు: రామజోగయ్య శాస్ర్తి; కెమెరా: కల్యాణ్. బి; ఎడిటర్: జి.యం.శాస్త్రి; యాక్షన్: వెంకట్; నిర్మాత: సుధాకర్.టి; కథ-స్క్రీన్ ప్లే-మాటలు- దర్శకత్వం: దుర్గా శ్రీ వత్సస.కె. బ్యానర్: వందన మూవీస్

More News

ట్రెండింగ్‌లో అల్టిమేట్‌ 'బిగినింగ్‌' ట్రైలర్‌

'ఎవడి పుట్టుకా ఎవ్వడికీ తెలీదు. కాని, పుట్టాక చావు ఖాయం' అంటూ తాత్విక క్యాష్షన్‌తో 'బిగినింగ్‌' ట్రైలర్‌పై ఆసక్తి రేంత్తించారు.

‘రౌడీ బాయ్స్‌’తో ఎంట్రీ ఇస్తున్న హీరో ఆశిష్.. ఫస్ట్ లుక్‌, మోష‌న్ పోస్ట‌ర్‌ విడుదల

దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్, ఆదిత్య మ్యూజిక్ అసోసియేష‌న్‌తో ... శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై శ్రీహ‌ర్ష కొనుగంటి ద‌ర్శ‌క‌త్వంలో

‘మాస్ట్రో’ ట్రైల‌ర్ విడుద‌ల

నితిన్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ మేర్లపాక గాంధీ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ‘మాస్ట్రో’.

‘స‌లార్‌’లో రాజ‌మ‌న్నార్‌గా జ‌గ‌ప‌తిబాబు.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

ప్యాన్ ఇండియా‌ స్టార్‌ ప్రభాస్‌.. ప్యాన్‌ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్‌ నీల్‌.. కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ ప్యాన్ ఇండియా మూవీ `స‌లార్‌`.

యాక్టివ్‌ తెలుగు ఫిల్మ్‌ ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ ప్రెస్‌నోట్‌

తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్‌ థియేటర్స్‌ అసోసియేషన్‌ ఆగస్టు 20, 2021న మీడియా సమావేశం నిర్వహించింది.