Virat Kohli:విరాట్ కోహ్లి కుమారుడు 'అకాయ్' పేరుకు అర్థం ఏంటంటే..?
Send us your feedback to audioarticles@vaarta.com
టీమిండియా రన్‌మెషీన్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ- అనుష్క శర్మ దంపతులు మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని స్వయంగా కోహ్లీ తెలియజేశాడు. తమ బిడ్డకు అకాయ్‌గా (Akaay) నామకరణం చేసినట్లు వెల్లడించాడు. దీంతో ఈ పేరు అర్థం ఏంటనేది అభిమానులు తెగ సెర్చ్ చేస్తున్నారు. అకాయ్ అంటే సంస్కృతంలో ఈ ‘అమరుడు’, ‘చిరంజీవుడు’ అనే అర్థం ఉందని నిపుణులు చెబుతున్నారు. అలాగే హిందీలో ‘కాయ్’ అంటే శరీరమని.. ‘అకాయ్’ అంటే భౌతిక శరీరానికి మించినవాడు అని వివరించారు. ఇక టర్కీ భాషలో ఈ పదానికి ‘ప్రకాశిస్తున్న చంద్రుడు’ అనే అర్థం కూడా ఉందని పేర్కొంటున్నారు. మరి ఈ పేరుకు అర్థం ఏంటో విరుష్క దంపతులే చెప్పాలి.
ఈ నెల 15న తన భార్య అనుష్కశర్మ మగబిడ్డకు జన్మనిచ్చిందని కోహ్లి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో తెలిపాడు. ‘‘ఫిబ్రవరి 15న మా బాబు, వామిక తమ్ముడు అకాయ్‌ని ఈ ప్రపంచంలోకి ఆహ్వానించాం. ఈ విషయం అందరికీ చెప్పడానికి సంతోషిస్తున్నాం. ఈ అందమైన సమయంలో మీ ఆశీర్వాదాలు కావాలి. మా ఏకాంతాన్ని గౌరవించమని విజ్ఞప్తి చేస్తున్నాం’’ అని కోహ్లి పేర్కొన్నాడు. దీంతో ప్రముఖులు, అభిమానుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కాగా కోహ్లి వ్యక్తిగత కారణాలతో భారత్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌కు దూరమైన సంగతి తెలిసిందే.
విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలు 11 డిసెంబర్ 2017న వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వివాహం అయిన మూడు సంవత్సరాల తర్వాత, జనవరి 11, 2021న వీరికి వామిక అనే కుమార్తె జన్మించింది. వామిక అంటే దుర్గాదేవి అని అర్థం చెప్పారు. కొంతకాలంగా విరాట్ మరోసారి తండ్రి కాబోతున్నాడనే చర్చ జోరుగా జరిగింది. సౌతాఫ్రికా మాజీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ మాత్రం కోహ్లి రెండో సారి తండ్రి కాబోతున్నాడని తెలిపాడు. కానీ కోహ్లి మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. చివరకు తమ ఆనంద క్షణాలకు అభిమానులతో పంచుకున్నారు. ఈనెల 15న తమకు అబ్బాయి పుట్టాడని అధికారికంగా ప్రకటించాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments