విరాట్ కోహ్లి బ‌యోపిక్‌.. కండీష‌న్ అప్లై

ఇండియ‌న్ సినిమాల్లో బ‌యోపిక్స్ హ‌వా న‌డుస్తోంది. పలు రంగాల‌కు చెందిన ప్ర‌ముఖ వ్య‌క్తుల జీవిత చ‌రిత్ర‌ల‌ను సినిమాల రూపంలో మ‌లుస్తున్నారు. ఈ క్ర‌మంలో ప‌లువురు క్రికెటర్స్ బ‌యోపిక్స్ కూడా రూపొందాయి. తాజాగా విరాట్ త‌న బ‌యోపిక్ గురించి ఇన్‌స్టాగ్రామ్ లైవ్ చాట్‌లో మాట్లాడారు. త‌న బ‌యోపిక్‌లో తానే హీరోగా న‌టించాల‌నుకుంటున్నాన‌ని విరాట్ కోహ్లి కండీష‌న్ పెట్టారు. అయితే దీనికి మ‌రో కండీష‌న్ కూడా కూడా పెట్టాడు. త‌న భార్య‌, బాలీవుడ్ హీరో్యిన్ అనుష్క‌ శర్మ అందులో త‌న‌కు జోడీ న‌టించాల‌నే కండిష‌న్ పెట్టాడు. మ‌రి విరాట్ పెట్టిన కండీష‌న్‌ను ఒప్పుకుని ఆయ‌న‌తో బ‌యోపిక్‌ను ఏ డైరెక్ట‌ర్ చేయ‌డానికి ముందుకు వ‌స్తాడు? ఈ విరాట్ బ‌యోపిక్‌ను ఎవ‌రు ప్రొడ్యూస్ చేస్తార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది.

క్రికెట‌ర్స్ విష‌యానికి వ‌స్తే అజ‌హ‌రుద్దీన్‌, ధోని, స‌చిన్ టెండూల్క‌ర్ బ‌యోపిక్స్ సినిమాల రూపంలో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాయి. ఇప్పుడు క‌పిల్ డెవిల్స్ సాధించిన 1983 వ‌రల్డ్ క‌ప్ జ‌ర్నీని 83 పేరుతో సినిమాగా తెర‌కెక్కించారు. లాక్ డౌన్ ఎఫెక్ట్ లేకుండా ఉండుంటే.. ఏప్రిల్ 10న సినిమా విడుద‌లై ఉండేది. ఈ బ‌యోపిక్‌లో రియ‌ల్ లైఫ్ క‌పుల్‌ ర‌ణ్వీర్ సింగ్‌, దీపికా పందుకొనే జంట‌గా న‌టించ‌డం విశేషం.

More News

సినీ ఇండ‌స్ట్రీ గురించి రామ్ ట్వీట్‌

ప్ర‌స్తుతం క‌రోనా ప్ర‌భావం వ‌ల్ల ఇబ్బందులు ప‌డుతున్న ప‌లు రంగాల్లో సినీ పరిశ్ర‌మ ముందు వ‌రుస‌లో ఉంది. థియేట‌ర్స్ మూత‌ప‌డ‌టం, షూటింగ్స్ లేక‌పోవ‌డం వంటి కార‌ణాలతో సినీ ప‌రిశ్ర‌మ స్తంభించింది.

టాలీవుడ్‌కు మళ్లీ షాకిచ్చిన కేసీఆర్.. ఆశలు ఆవిరి!

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కబలిస్తున్న కష్టకాలంలో యావత్ భారతదేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తున్న విషయం విదితమే. ఇప్పటికే మూడు లాక్ డౌన్‌లు పూర్తవ్వగా.. 4.0 మే-18 నుంచి మే-31వరకు ఉండనుంది.

వైఎస్ జగన్‌.. నేను కలిసే ఉన్నాం.. మాకేం వివాదాల్లేవ్ : కేసీఆర్

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న పోతిరెడ్డిపాడు వివాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. ఈ వ్యవహారంపై పరోక్షంగా సీఎం జగన్ మోహన్ రెడ్డిని కాస్త హెచ్చరిస్తూనే కేసీఆర్ మాట్లాడారు.

కేంద్రం ప్యాకేజీ దరిద్రం.. ఆ ముష్టి మాకొద్దు : కేసీఆర్

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న కష్ట కాలంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన విషయం విదితమే. దీనిపై ఐదు దఫాలుగా పూర్తి వివరాలను

తెలంగాణ రికార్డ్స్ బద్ధలు కొడుతోంది : కేసీఆర్

తెలంగాణ చాలా అద్భతమైన వ్యవసాయ రాష్ట్రం.. ఇక్కడ అద్భుతమైన నేలలు ఉన్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఇవాళ సుధీర్ఘ కేబినెట్ భేటీ అనంతరం ప్రగతి భవన్‌లో