గుడ్ న్యూస్ చెప్పిన విరుష్క..
Send us your feedback to audioarticles@vaarta.com
టీమ్ ఇండియా, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ గురువారం గుడ్ న్యూస్ చెప్పాడు. తన భార్య అనుష్కశర్మ తల్లి కాబోతోందని వెల్లడించాడు. త్వరలోనే తాము ముగ్గురం కాబోతున్నామని వెల్లడిస్తూ ఓ పిక్‌ను పోస్ట్ చేశాడు. ట్విట్టర్ వేదికగా అనుష్కతో కలిసి దిగిన పిక్‌ను అభిమానులతో పంచుకున్నాడు.
‘మేము త్వరలో ముగ్గురం కాబోతున్నాం. 2021 జనవరిలో పండంటి బిడ్డ రాబోతోంది’ అని కోహ్లీ ట్వీట్ చేశాడు. బేబీ బంప్‌తో ఉన్న అనుష్క ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు. కోహ్లీకి అభిమానులేమైనా తక్కువా..? ట్విట్టర్లో శుభాకాంక్షల మోత మోగిస్తున్నారు. సెలబ్రిటీలు సైతం విరుష్క జంటకు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేస్తున్నారు.
విరాట్ కోహ్లీ, బాలీవుడ్ తార అనుష్క శర్మల ప్రేమ వివాహం 2017, డిసెంబర్ 11న జరిగిన విషయం తెలిసిందే. కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో ఈ ప్రేమ జంట ఒక్కటైంది. 2013లో ఓ వాణిజ్య ప్రకటన షూటింగ్ సందర్భంగా కోహ్లీ, అనుష్క తొలిసారిగా కలుసుకున్నారు. ఈ సమయంలోనే వారి ప్రేమ చిగురించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com