వైరల్ పిక్స్: పూజా హెగ్డేతో ఫోటో.. సిగ్గు పడిపోతున్న కొరటాల శివ
Send us your feedback to audioarticles@vaarta.com
పూజా హెగ్డేతో ఫోటో దిగేందుకు కొరటాల శివ సిగ్గు పడడం ఏంటి అనుకుంటున్నారా. అవును ఇది నిజం. ఈ సంగతిని స్వయంగా పూజా హెగ్డే బయట పెట్టింది. మంగళ వారం రోజు కొరటాల శివ తన 46వ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. చిత్ర పరిశ్రమలో ప్రముఖులు కొరటాల శివకి శుభాకాంక్షలు తెలియజేశారు.
అందాల బుట్టబొమ్మ పూజా హెగ్డే కూడా కొరటాల శివని విష్ చేసింది. అందమైన ఫోటోస్ ద్వారా కొరటాలకు పూజా హెగ్డే బర్త్ డే విషెస్ తెలిపింది. ఈ ఫోటోస్ లో పూజా హెగ్డే అందాల దేవతల చిరునవ్వుతో వెలిగిపోతోంది. కానీ ఆమె పక్కనే ఉన్న కొరటాల ముఖంలో మాత్రం సిగ్గు, బిడియం కనిపిస్తున్నాయి.
కొరటాల ఫోటోలంటే ఎంతో సిగ్గు అని పూజా హెగ్డే ఫన్నీ కామెంట్స్ చేసింది. 'హ్యాపీ బర్త్ డే కొరటాల సర్. దిగాలంటే మీకు ఇబ్బంది అని తెలుసు. అయినప్పటికీ నా కోసం ఫోటోలకు ఫోజు ఇచ్చినందుకు థాంక్స్. ఈ ఏడాది మీకు మరిన్ని వ్బ్లాక్ బస్టర్స్, అదృష్టం దక్కాలని కోరుకుంటున్నాను. త్వరలో ఆచార్య సెట్ లో కలుసుకుందాం అని పూజా హెగ్డే ట్వీట్ చేసింది.
కొరటాల శివ దర్శత్వంలో మెగాస్టార్ చిరంజీవి ఆచార్య చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మెగాపవర్ స్టార్ రాంచరణ్ కీలక పాత్రలో మెరుస్తుండగా.. అతడికి జోడిగా పూజా హెగ్డే నటిస్తోంది. ఈ ఫోటోస్ లో పూజా హెగ్డే లంగాఓణీ ధరించి చూడచక్కగా ఉంది.
ఆచార్య చిత్రం కోసం అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గాక ఈ చిత్ర రిలీజ్ పై క్లారిటీ రానుంది. మణిశర్మ ఈ చిత్రాన్ని సంగీత దర్శకుడు.
Happy Birthday @sivakoratala sir! I know how awkward you are when it comes to taking pictures of yourself, but thank you for graciously granting my request! ?? Hope this year is filled with love, luck and BLOCKBUSTERS ??See you on set soon! ???????? #Acharya pic.twitter.com/ya4uIKpsMe
— Pooja Hegde (@hegdepooja) June 15, 2021
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout