వైరల్ పిక్స్ : భర్తతో రొమాంటిక్ మూడ్ లో కాజల్
Send us your feedback to audioarticles@vaarta.com
సౌత్ స్టార్ హీరోయిన్స్ లో కాజల్ అగర్వాల్ ప్రత్యేకం. దాదాపు దశాబ్దానికి పైగా ఆమె స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. అలాగని హద్దులు దాటే గ్లామర్ ఒలకబోయలేదు. నటన, గ్లామర్ తో కాజల్ ప్రతి ఒక్కరిని మెప్పించింది. సౌత్ లో దాదాపు అందరు స్టార్ హీరోలతో కాజల్ ఆడి పాడింది.
ఇప్పటికి కాజల్ బిజీ హీరోయిన్ గానే కొనసాగుతోంది. గత ఏడాది కాజల్ తన స్నేహితుడు గౌతమ్ కిచ్లుని పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. కాజల్ ప్రస్తుతం అటు సినిమాలు, ఇటు ఫ్యామిలీని బ్యాలన్స్ చేస్తూ మ్యారేజ్ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది.
లేటెస్ట్ గా కాజల్ తన భర్తతో రొమాంటిక్ మూడ్ లో ఉన్న పిక్స్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోస్ నెట్టింట వైరల్ గా మారాయి. ఇద్దరూ క్యాజువల్ డ్రెస్ లలో ఉన్నారు. కాజల్ ని గౌతమ్ హత్తుకుని ఉండగా ఇద్దరూ స్టెప్స్ పై రొమాన్స్ లో ఉన్నారు. భర్త తనకు ముద్దు పెడుతున్న పిక్ కూడా కాజల్ పోస్ట్ చేసింది.
సినిమాల విషయానికి వస్తే కాజల్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సరసన 'ఆచార్య' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం కరోనా కేసులు తగ్గాక థియేటర్స్ లో రిలీజ్ కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments