మెడలో తాళిబొట్టు.. సురేఖా వాణి సీక్రెట్‌గా రెండో పెళ్లి చేసుకుందా, పిక్ వైరల్
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు చిత్ర సీమలో తల్లి, అక్క, వదిన, స్నేహితురాలి పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సురేఖా వాణి. సోషల్ మీడియాలోనూ ఎంతో చురుగ్గా వుండే ఈమె.. కాంట్రవర్సీల్లోనూ వేలు పెడుతుంటారు. అయితే కొద్ది నెలల క్రితం సురేఖ భర్త అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే. భర్త మరణంతో ఎంతో కృంగిపోయింది సురేఖ. సినిమాలలోనూ, బయట కూడా దాదాపు కనిపించడం మానేసింది.
భర్త మరణం తర్వాత కొన్ని మనస్పర్థల కారణంగా అత్తింటి కుటుంబం కూడా తమతో దూరంగా ఉంటోందని, ప్రస్తుతం తన కూతురు సుప్రీతతో కలిసి ఒంటరిగా వుంటానని చెప్పుకుని బాధపడ్డారు సురేఖ. అప్పటి నుంచి కూతురితో కలిసి డ్యాన్స్‌లు చేస్తూ ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తున్నారామె. అయితే సింగర్ సునీత రెండో పెళ్లి చేసుకోవడంతో.. సురేఖ కూడా మనసు మార్చుకున్నారని.. ఆమె కూడా జీవితంలో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారంటూ వార్తలు వచ్చాయి. కానీ వాటిని సురేఖ ఖండించారు. తన కుమార్తె తప్ప తనకు ఏది ముఖ్యం కాదని స్పష్టం చేశారు.
అయితే తాజాగా ఆమె మెడలో తాళిబొట్టు కనిపించిన ఫోటోలు బయటకు రావడంతో సినీజనాలతో పాటు ప్రేక్షకులు షాకవుతున్నారు. ఇన్స్‌స్టా స్టోరీగా ఓ పిక్ షేర్ చేసిన సురేఖ మెడలో తాళిబొట్టుతో కనిపించింది. దీంతో ఈ పిక్ చూసి సురేఖావాణి సీక్రెట్‌గా రెండో పెళ్లి చేసుకుందా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు మాత్రం ఇది ఏదో సినిమా కోసం వేసిన వేషం కావచ్చు అంటున్నారు. నిజంగా ఆమె సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారా .. లేఖ సినిమా కోసం అలా వేషం వేశారా అన్నది తెలియాలంటే సురేఖా వాణి నోరు విప్పాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments