వైరల్ పిక్ : అల్లువారబ్బాయితో అజ్ఞాతవాసి హీరోయిన్ ఘాటు రొమాన్స్
Send us your feedback to audioarticles@vaarta.com
ఒక సాలిడ్ హిట్ తో హీరోగా తనదైన ముద్ర వేయాలని అల్లు శిరీష్ గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. శ్రీరస్తు శుభమస్తు మాత్రమే అల్లు శిరీష్ కెరీర్ లో చెప్పుకోదగ్గ చిత్రం. ఇకపై ట్రెండీగా ప్రేక్షకులు కోరుకునే చిత్రాలు చేయాలని శిరీష్ భావిస్తున్నాడు. అంతే కాదు సిక్స్ ప్యాక్ బాడీతో తన లుక్ మార్చుకునే ప్రయత్నంలో కూడా శిరీష్ ఉన్నాడు.
మే 30న అల్లు సిరీస్ పుట్టినరోజు. ఆ రోజు శిరీష్ తదుపరి చిత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ కానుంది. తన హోమ్ బ్యానర్ జీఏ 2 పిక్చర్స్ లోనే ఈ చిత్రం తెరకెక్కుతోంది. అజ్ఞాతవాసిలో నటించిన అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ప్రీ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.
ఇదీ చదవండి: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. అది ఆగిపోయినట్లే ?
ఈ చిత్రం ఘాటైన రొమాన్స్ తో తెరకెక్కుతోందని ఈ పోస్టర్ ద్వారా చెప్పకనే చెప్పారు. శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ టైట్ హగ్ తో లిప్ లాక్ లో లీనమైపోయి ఉన్నారు. ఈ పోస్టర్ సినిమాపై యూత్ లో క్రేజ్ పెంచుతుంది అనడంలో సందేహం లేదు.
ఈ చిత్రం రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది అని టాక్. ఈ తరహా రొమాంటిక్ మూవీ చేయడం శిరీష్ కి ఇదే ఫస్ట్ టైం. బోల్డ్ రొమాన్స్ తో ఉన్న చిత్రాలకు ప్రజెంట్ క్రేజ్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక అను ఇమ్మాన్యుయేల్ ఈ చిత్రంతో అయిన వరుస ప్లాపులకు చెక్ పెట్టాలని చూస్తోంది. అను ఇమ్మాన్యుయేల్ అల్లు అర్జున్ సరసన 'నా పేరు సూర్య' చిత్రంలో నటించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments