వైరల్ పిక్ : అల్లువారబ్బాయితో అజ్ఞాతవాసి హీరోయిన్ ఘాటు రొమాన్స్

  • IndiaGlitz, [Thursday,May 27 2021]

ఒక సాలిడ్ హిట్ తో హీరోగా తనదైన ముద్ర వేయాలని అల్లు శిరీష్ గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. శ్రీరస్తు శుభమస్తు మాత్రమే అల్లు శిరీష్ కెరీర్ లో చెప్పుకోదగ్గ చిత్రం. ఇకపై ట్రెండీగా ప్రేక్షకులు కోరుకునే చిత్రాలు చేయాలని శిరీష్ భావిస్తున్నాడు. అంతే కాదు సిక్స్ ప్యాక్ బాడీతో తన లుక్ మార్చుకునే ప్రయత్నంలో కూడా శిరీష్ ఉన్నాడు.

మే 30న అల్లు సిరీస్ పుట్టినరోజు. ఆ రోజు శిరీష్ తదుపరి చిత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ కానుంది. తన హోమ్ బ్యానర్ జీఏ 2 పిక్చర్స్ లోనే ఈ చిత్రం తెరకెక్కుతోంది. అజ్ఞాతవాసిలో నటించిన అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ప్రీ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.

ఇదీ చదవండి: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. అది ఆగిపోయినట్లే ?

ఈ చిత్రం ఘాటైన రొమాన్స్ తో తెరకెక్కుతోందని ఈ పోస్టర్ ద్వారా చెప్పకనే చెప్పారు. శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ టైట్ హగ్ తో లిప్ లాక్ లో లీనమైపోయి ఉన్నారు. ఈ పోస్టర్ సినిమాపై యూత్ లో క్రేజ్ పెంచుతుంది అనడంలో సందేహం లేదు.

ఈ చిత్రం రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది అని టాక్. ఈ తరహా రొమాంటిక్ మూవీ చేయడం శిరీష్ కి ఇదే ఫస్ట్ టైం. బోల్డ్ రొమాన్స్ తో ఉన్న చిత్రాలకు ప్రజెంట్ క్రేజ్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక అను ఇమ్మాన్యుయేల్ ఈ చిత్రంతో అయిన వరుస ప్లాపులకు చెక్ పెట్టాలని చూస్తోంది. అను ఇమ్మాన్యుయేల్ అల్లు అర్జున్ సరసన 'నా పేరు సూర్య' చిత్రంలో నటించింది.

More News

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. అది ఆగిపోయినట్లే ?

యంగ్ టైగర్ వరుస ప్రాజెక్ట్స్ తో బిజీ అవుతున్నాడు. కెరీర్ లో ఎన్నడూ లేని విధంగా ఎన్టీఆర్ భారీ చిత్రాలకు సైన్ చేస్తున్న సంగతి తెలిసిందే. రాబోవు రెండు మూడేళ్ళలో ఎన్టీఆర్ ఫ్యాన్స్

మళ్ళీ నితిన్ తోనే.. సూపర్ హిట్ కాంబో రిపీట్ ?

ఛలో చిత్రంతో తొలి ప్రయత్నంలోనే దర్శకుడిగా సక్సెస్ అందుకున్నాడు వెంకీ కుడుముల. ఆ తర్వాత నితిన్ తో వెంకీ తెరకెక్కించిన భీష్మ కూడా సూపర్ హిట్ గా నిలిచింది.

బిగ్గెస్ట్ సర్ ప్రైజ్ : కళ్యాణ్ రామ్ ఏం చేయబోతున్నాడో తెలుసా ?

నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్ పడుతూ లేస్తూ సాగుతోంది.కెరీర్ ఆరంభంలో అతనొక్కడే చిత్రంతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాడు.

ఇంగ్లీష్ సహా ఐదు విదేశీ భాషల్లో RRR విడుదల

బాహుబలితో దేశం మొత్తం తన సత్తా చాటిన దర్శక ధీరుడు రాజమౌళి.. ఆర్ఆర్ఆర్ తో వరల్డ్ వైడ్ గా తన ప్లాన్స్ అమలు చేయబోతున్నాడు.

ఈ వయసులో కూడా తప్పు చేశా.. లవ్ బ్రేకప్ పై సీనియర్ హీరోయిన్

మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ బాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన నటి. ప్రస్తుతం సుస్మితాసేన్ వయసు 45 ఏళ్ళు. అయితే ఆమె ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు.