Taraka Ratna : తారకరత్న కన్నుమూత : చంద్రబాబు, కేసీఆర్, పవన్ కల్యాణ్, జగన్ సంతాపం
Send us your feedback to audioarticles@vaarta.com
సినీనటుడు నందమూరి తారకరత్న ఆకస్మిక మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమ ముఖ్యంగా నందమూరి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని.. త్వరలోనే కోలుకుని తిరిగి వస్తారని భావిస్తున్న వేళ తారకరత్న తిరిగిరాని లోకాలకు తరలిపోవడంతో అభిమానులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులు ఆయనకు తమ సంతాపం తెలియజేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌లు తారకరత్న కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
చంద్రబాబు నాయుడు:
నందమూరి తారకరత్న మరణ వార్త తీవ్రమైన దిగ్భ్రాంతిని, బాధను కలిగించింది. తారకరత్నను బ్రతికించుకునేందుకు చేసిన ప్రయత్నాలు, కుటుంబ సభ్యుల, అభిమానుల ప్రార్థనలు, అత్యంత నిపుణులైన డాక్టర్ల వైద్యం ఫలితాన్ని ఇవ్వలేదు. 23 రోజుల పాటు మృత్యువు తో పోరాడిన తారకరత్న... చివరికి మాకు దూరం అయ్యి మా కుటుంబానికి విషాదం మిగిల్చాడు. తారకరత్న ఆత్మకు శాంతిని చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.
నారా లోకేష్ :
బావ అంటూ ఆప్యాయంగా పిలిచే ఆ గొంతు ఇక నాకు వినిపించదు. నేనున్నానంటూ నా వెంట నడిచిన ఆ అడుగుల చప్పుడు ఆగిపోయింది. నందమూరి తారకరత్న మృతి దిగ్భ్రాంతికి గురి చేసింది. తెలుగుదేశం యువతేజం తారకరత్న మృతి మా కుటుంబానికి, తెలుగుదేశం పార్టీకి తీరని లోటు. నిష్కల్మషమైన నీ ప్రేమ, స్నేహ బంధం మన బంధుత్వం కంటే గొప్పది. తారకరత్నకి కన్నీటి నివాళి అర్పిస్తూ, తారకరత్న పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నాను.
పవన్ కల్యాణ్ :
నటుడు ‘‘ నందమూరి తారకరత్న కన్నుమూయడం బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను. గత మూడు వారాలుగా బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్న కోలుకొంటారని భావించాను. ఆయన నటుడిగా రాణిస్తూనే ప్రజా జీవితంలో ఉండాలనుకొన్నారు. ఆ ఆశలు నెరవేరకుండానే తుదిశ్వాస విడవటం దురదృష్టకరం. తారకరత్న భార్యాబిడ్డలకి, తండ్రి మోహనకృష్ణ, బాబాయి బాలకృష్ణ, ఇతర కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.
విజయసాయిరెడ్డి :
సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగిరావాలని కోరుకున్నాం. కాని విధి మరోలా తలచింది. నందమూరి తారకరత్న అకాల మరణం అత్యంత బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని ప్రార్థిస్తున్నాను. అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి.
శ్రీ నందమూరి తారకరత్న ఆత్మకు శాంతి చేకూరాలి - JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/RmKnZZaSvv
— JanaSena Party (@JanaSenaParty) February 18, 2023
23 రోజుల పాటు మృత్యువు తో పోరాడిన తారకరత్న... చివరికి మాకు దూరం అయ్యి మా కుటుంబానికి విషాదం మిగిల్చాడు. తారకరత్న ఆత్మకు శాంతిని చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.(2/2)
— N Chandrababu Naidu (@ncbn) February 18, 2023
Chief Minister Sri YS Jagan Mohan Reddy has expressed grief over the death of Sri Nandamuri Taraka Ratna, film actor and grand son of NTR and conveyed his condolences to the bereaved family members.
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) February 18, 2023
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments