కరోనాపై పోరుకు విప్రో అధినేత భారీ విరాళం
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా వైరస్ ప్రపంచాన్ని కాటేస్తున్న నేపథ్యంలో పలువురు ప్రముఖులు సాయం చేసి పెద్ద మనసు చాటుకుంటున్నారు. లాక్‌డౌన్ చేయడం.. మరోవైపు ప్రజా రవాణా బంద్ చేయడంతో నిరుపేదలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంటికే రేషన్.. కందిపప్పుతో కొంచెం డబ్బులు కూడా ఇస్తున్నట్లు ప్రకటించాయి. అయితే ఈ క్రమంలో తమ వంతుగా సాయం చేయడానికి రాజకీయ నేతలు, నటీనటులు, వ్యాపారవేత్తలు, క్రీడా ప్రముఖులు ముందుకొస్తున్నారు. అంతేకాదు కొన్ని నిర్మాణ సంస్థలు, ఫార్మా కంపెనీలు సైతం ముందుకొచ్చాయి.
భారీ విరాళం
ఇప్పటికే పలువురు తమ వంతుగా సాయం ప్రకటించగా.. తాజాగా విప్రో అధినేత అజీం ప్రేమ్‌జీ ముందుకొచ్చారు. కరోనా నివారణ కోసం రూ. 1,125 కోట్ల సాయం చేయనున్నట్లు ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. విప్రో లిమిటెడ్ రూ.100 కోట్లు, విప్రో ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ రూ. 25కోట్లు, అజీం ప్రేమ్‌జీ ఫౌండేషన్ రూ. 1000 కోట్లు ఇస్తున్నట్లు అజీం ప్రేమ్ జీ వెల్లడించారు. ఇంత పెద్ద మొత్తం భారీ విరాళం ప్రకటించడం సంతోషించాల్సిన విషయమే. ఫౌండేషన్ సాధారణ దాతృత్వ ఖర్చులతో సంబంధం లేకుండా ఫౌండేషన్ నుంచి కూడా అదనంగా విరాళం ఇస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. కాగా.. ఇప్పటికే టాటా సంస్థ రూ.1500 కోట్లు, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ రూ.500, ఇన్పోసిస్ రూ.100 కోట్లు విరాళం ప్రకటించిన విషయం విదితమే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments