కరోనాపై పోరుకు విప్రో అధినేత భారీ విరాళం

  • IndiaGlitz, [Wednesday,April 01 2020]

కరోనా వైరస్ ప్రపంచాన్ని కాటేస్తున్న నేపథ్యంలో పలువురు ప్రముఖులు సాయం చేసి పెద్ద మనసు చాటుకుంటున్నారు. లాక్‌డౌన్ చేయడం.. మరోవైపు ప్రజా రవాణా బంద్ చేయడంతో నిరుపేదలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంటికే రేషన్.. కందిపప్పుతో కొంచెం డబ్బులు కూడా ఇస్తున్నట్లు ప్రకటించాయి. అయితే ఈ క్రమంలో తమ వంతుగా సాయం చేయడానికి రాజకీయ నేతలు, నటీనటులు, వ్యాపారవేత్తలు, క్రీడా ప్రముఖులు ముందుకొస్తున్నారు. అంతేకాదు కొన్ని నిర్మాణ సంస్థలు, ఫార్మా కంపెనీలు సైతం ముందుకొచ్చాయి.

భారీ విరాళం

ఇప్పటికే పలువురు తమ వంతుగా సాయం ప్రకటించగా.. తాజాగా విప్రో అధినేత అజీం ప్రేమ్‌జీ ముందుకొచ్చారు. కరోనా నివారణ కోసం రూ. 1,125 కోట్ల సాయం చేయనున్నట్లు ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. విప్రో లిమిటెడ్ రూ.100 కోట్లు, విప్రో ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ రూ. 25కోట్లు, అజీం ప్రేమ్‌జీ ఫౌండేషన్ రూ. 1000 కోట్లు ఇస్తున్నట్లు అజీం ప్రేమ్ జీ వెల్లడించారు. ఇంత పెద్ద మొత్తం భారీ విరాళం ప్రకటించడం సంతోషించాల్సిన విషయమే. ఫౌండేషన్‌ సాధారణ దాతృత్వ ఖర్చులతో సంబంధం లేకుండా ఫౌండేషన్‌ నుంచి కూడా అదనంగా విరాళం ఇస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. కాగా.. ఇప్పటికే టాటా సంస్థ రూ.1500 కోట్లు, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ రూ.500, ఇన్పోసిస్ రూ.100 కోట్లు విరాళం ప్రకటించిన విషయం విదితమే.

More News

కరోనా సోకిందని వివక్ష చూపొద్దు.. ప్రేమ చూపండి : జగన్

తాడేపల్లి : కరోనాపై ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. కరోనా వైరస్‌ లక్షణాలు గుర్తించి వైద్యం అందించడంలో సమగ్ర విధానం అవలంభిస్తున్నామని తెలిపారు.

నిద్రపోయి పాపులర్ అయ్యాడు.. తీరా చూస్తే..!

టైటిల్ చూడగానే.. ఇదేంటి ఇందులో విచిత్రం ఏముంది..? అందరికీ నిద్రొస్తుంది.. నిద్రపోతారు కదా.. ఇందులో కొత్త విషయం ఏముంది అనుకుంటున్నారా..?

క‌రోనా క‌ష్టాలు .. ఎడారిలో చిక్కుకున్న స్టార్ హీరో

క‌రోనా ప్ర‌భావం కార‌ణంగా దేశ‌మంతా ముఖ్య‌మైన ప‌నులు, ర‌వాణా, ప్ర‌ధాన ఆర్థిక కార్య‌కలాపాలు అన్నీ స్తంభించాయి. సినిమా ప‌రిశ్ర‌మ అయితే షూటింగ్‌ల‌న్నింటినీ ఆపేశాయి.

షాకింగ్: మర్కజ్ చీఫ్ ఆడియో టేపుల కలకలం.. రంగంలోకి దోవల్!

దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా నిజాముద్దీన్ మర్కజ్ ప్రార్థనల గురించే చర్చ. ఈ ప్రార్థనల్లో పాల్గొన్నవారిలో ఎక్కువ మంది కరోనా వైరస్ బారినపడినట్టు నిర్ధారణ కావడంతో ప్రపంచ

ఆపరేషన్ 'నిజాముద్దీన్'.. మర్కజ్ వెళ్లిన వారి జాబితా రెడీ!

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరిగిన నిజాముద్దీన్ మర్కజ్‌ ముస్లింల ప్రార్థనల వ్యవహారం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. అసలు ఈ సదస్సుకు ఎక్కడెక్కడ్నుంచి వచ్చారో..?