'విఐపి2' టీజర్ రిలీజ్ డేట్
Send us your feedback to audioarticles@vaarta.com
ధనుష్ హీరోగా సౌందర్య రజనీకాంత్ దర్శకత్వంలో కలైపులి థాను వి.ఐ.పి2 చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ కాజోల్ కీలకపాత్రలో నటించనుండటం విశేషం. అప్పుడెప్పుడో మెరుపు కలలు సినిమాతో దక్షిణాది ప్రేక్షకులను పలకరించిన కాజోల్ ఆ తర్వాత హిందీ సినిమాలతో బిజీగా మారింది. తర్వాత మరే దక్షిణాది సినిమాలోనూ యాక్ట్ చేయలేదు.
దాదాపు రెండు దశాబ్దాలు తర్వాత కాజల్ మరోసారి దక్షిణాది సినిమాల్లో యాక్ట్ చేసింది. ఈ సినిమాను జూలై 14న విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ సినిమా టీజర్‌ను జూన్ 7న ఒకేసారి తెలుగు, తమిళంలో విడుదల చేయబోతున్నారు. విఐపి2 ముందు భాగం రఘవరన్ బి.టెక్ మంచి విజయం సాధించడంతో విఐపి2పై మంచి అంచనాలే నెలకొన్నాయి. మరి తెలుగులో ఈ చిత్రాన్ని ఎవరు కొని విడుదల చేస్తారో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com