జూలై మూడోవారంలో 'వినోదం 100%' ఆడియో విడుదల

  • IndiaGlitz, [Saturday,July 04 2015]

ఎస్‌.ఎస్‌. సెల్యులాయిడ్స్‌ పతాకంపై శ్రీరామ్‌మూర్తి దర్శకత్వంలో విజయ్‌ భరత్‌, అశ్విని, కాంచనలు హీరో హీరోయిన్‌లుగా పొట్నూరి శ్రీనివాసరావు నిర్మిస్తున్న కామెడీ ఎంటర్‌టైనర్‌ చిత్రం వినోదం 100%'. ఈ చిత్రంలో బర్నింగ్‌ స్టార్‌ సంపూర్ణేష్‌ బాబు, బాయిలింగ్‌ స్టార్‌ పృథ్వీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. డబ్బింగ్‌ మరియు ఎడిటింగ్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ఆడియో ఆవిష్కరణ జరుపుకోనుంది.

ఈ సందర్భంగా

చిత్ర నిర్మాత పొట్నూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ..100% వినోదం పంచే అద్భుతమైన చిత్రమిది. యూత్‌ అండ్‌ ఫ్యామిలీ ఆడియెన్స్‌ని ఆకర్షించే అంశాలు ఈ చిత్రంలో పుష్కలంగా ఉన్నాయి. ఈ చిత్రంలో బర్నింగ్‌స్టార్‌ సంపూర్ణేష్‌బాబు, బాయిలింగ్‌ స్టార్‌ పృథ్వీలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వాళ్ళ నటన, కామెడీ ఈ చిత్రానికి హైలెట్‌ గా ఉంటుంది. ప్రస్తుతం డబ్బింగ్‌, ఎడిటింగ్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. జూలై మూడవ వారంలో ఆడియో ఆవిష్కరణ జరిపి, వెంటనే మూవీని రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాము..' అన్నారు.

బర్నింగ్‌స్టార్‌ సంపూర్ణేష్‌బాబు, బాయిలింగ్‌ స్టార్‌ పృథ్వీలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో విజయ్‌ భరత్‌, అశ్విని, కాంచన, సత్యం రాజేష్‌, సప్తగిరి, పోసాని కృష్ణమురళి, జయప్రకాష్‌రెడ్డి, తాగుబోతు రమేష్‌ తదితరులు ముఖ్య తారాగణం.
సాంకేతిక నిపుణులు:సంగీతం: సుభాష్‌ ఆనంద్‌, కథ: జయకుమార్‌, మాటలు: అంజన్‌, పాటలు: చిర్రావూరి విజయ్‌కుమార్‌,కృష్ణచిన్ని, కెమెరా: మల్లిఖార్జున్‌, ఎడిటింగ్‌: రాంబాబు, నిర్మాత: పొట్నూరి శ్రీనివాసరావు స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: శ్రీరామ్‌మూర్తి

More News

అక్కినేని హీరోతో మాంత్రికుడు...

‘ఒక లైలా కోసం’ చిత్రం తర్వాత నాగచైతన్య ప్రస్తుతం గౌతమ్ మీనన్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. బిజీగా ఉంటూనే కొత్త కథలను వింటున్నాడు.

'సూపర్ స్టార్ కిడ్నాప్' మూవీ రివ్యూ

స్టార్ హీరోల పేర్లను చిన్న సినిమాల్లో వాడుకోవడం కామన్ విషయమే. అలాంటి ప్రయత్నంతో రూపొందిన చిత్రమే సూపర్ స్టార్ కిడ్నాప్. ఇందులో మహేష్ పేరుని, తను నటించిన చిత్రాల్లో కొన్ని డైలాగ్స్ ను వాడుకున్నారు.

'బస్తీ' మూవీ రివ్యూ

తెలుగు సినిమా రంగంలో నట వారసుల హవా కొనసాగుతుంది. ఈ కోవలో చాలా మంది హీరోలు సినీ రంగ ప్రవేశం చేశారు. తర్వాత తమ ప్రతిభతో ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు.

ఆగస్టు 28న సుబ్రమణ్యం ఫర్ సేల్

సాయిధరమ్తేజ్ హీరోగా నటిస్తున్న సుబ్రమణ్యం ఫర్ సేల్ ఆగస్టు 28న విడుదల కానుంది. ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు నిర్మాత.

బాలయ్యతో మరోసారి చేస్తుంది...

‘సింహా’, ‘లెజెండ్’, ‘లయన్’ వంటి వరుస విజయాలను సాధించిన బాక్సాఫీస్ బొనాంజా నటసింహ నందమూరి బాలకృష్ణ తన 99వ చిత్రం ‘డిక్టేటర్’లో నటించడానికి సిద్ధమవుతున్నారు.