స్టూడియో నిర్మించాలనుకుంటున్న వినాయక్
Send us your feedback to audioarticles@vaarta.com
స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ ... తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితమైనే పేరే. కమర్షియల్ డైరెక్టర్‌గా తనదైన గుర్తింపు సంపాదించుకున్నారీయన. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, ప్రభాస్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసి బ్లాక్ బస్టర్స్ హిట్స్‌ను సాధించాడీయన. అయితే ఈ మధ్య ఈయనకు డైరెక్టర్‌గా అనుకున్న స్థాయి హిట్ మాత్రం లేదు. తాజాగా `సీనయ్య` సినిమాతో హీరోగా కూడా ఎంట్రీ ఇస్తున్నాడు. ఒక పక్క దర్శకుడి నుండి హీరోగా మారిన వినాయక్ కుటుంబానికి రాజకీయాలు, రాజకీయ నాయకులతోనూ మంచి టచ్ ఉంది.
కాగా.. వినాయక్ మరో టర్న్ తీసుకోవాలనుకుంటున్నాడట. ఆయన ఓ స్టూడియోను నిర్మించాలని భావిస్తున్నాడట. వివరాల్లోకెళ్తే చేవెళ్ల దగ్గర డైరెక్టర్ వినాయక్ 20 ఏకరాలను కొన్నాడట. ఈ ప్రాంతంలో సినిమాలను నిర్మించడానికి అనువుగా ఓ స్టూడియోను కట్టాలని అనుకుంటున్నాడట. అందులో భాగంగా ప్రభుత్వం దగ్గర పర్మిషన్ అడగటం.. దానికి పర్మిషన్ కూడా రావడం జరిగిపోయాయయని వార్తలు వినపడుతున్నాయి. దీంతో పాటు వినాయక్ ఓ రిసార్ట్‌ను కూడా కట్టాలని అనుకుంటున్నాడట. వీకెండ్స్‌లో హైదరాబాద్ వాసులు వచ్చి సేద తీరేలా ఈ రీసార్ట్‌ను నిర్మించాలనేదే వినాయక్ ఆలోచనగా కనపడుతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments