Vimanam:మంచి కంటెంట్ చిత్రాలను ఆదరిస్తామని 'విమానం' సినిమాతో నిరూపించిన ప్రేక్షకులకు థాంక్స్: సముద్ర ఖని
Send us your feedback to audioarticles@vaarta.com
సముద్ర ఖని, మాస్టర్ ధ్రువన్, అనసూయ భరద్వాజ్, రాహుల్ రామకృష్ణ, ధనరాజ్ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘విమానం’. జూన్ 9న వరల్డ్ వైడ్‌గా తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ రిలీజై సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. శివ ప్రసాద్ యానాల దర్శకత్వంలో జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి (కిరణ్ కొర్రపాటి క్రియేటివ్ వర్క్స్) ‘విమానం’ చిత్రాన్ని నిర్మించారు. శనివారం ఈ మూవీ సక్సెస్ మీట్‌ను చిత్ర యూనిట్ నిర్వహించింది.
ఈ సందర్బంగా..
సముద్ర ఖని మాట్లాడుతూ ‘‘ఓ మంచి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తే వాళ్లే ఆ సినిమాను భుజాలపై మోస్తారు అని చెప్పటానికి ‘విమానం’ సినిమా బెస్ట్ ఎగ్జాంపుల్. ఇది చాలా సార్లు ప్రూవ్ అయ్యింది. మరోసారి విమానంతో ప్రూవ్ అయ్యింది. జీ స్టూడియోస్ వారికి థాంక్స్. నా ఫస్ట్ ఫిల్మ్ ఫ్లాప్. ఆరోజు నా పుట్టినరోజు ఒక్కరూ కూడా కాల్ చేయలేదు. నేనేమో ఫోస్ చూస్తూనే ఉంటే నా ఫ్రెండ్ కూడా ఎందుకలా ఫోన్ వంకే చూస్తున్నావని తిట్టాడు. అది నా తొలి సినిమాకు వచ్చిన ఫీలింగ్. కానీ విమానం దర్శకుడు శివ ప్రసాద్‌గారికి తొలి సినిమాతోనే మంచి హిట్ వచ్చింది. అందుకు ఆయనకు కంగ్రాట్స్. విమానం రిలీజ్ తర్వాత థియేటర్స్ సంఖ్య పెరిగాయని జీ స్టూడియోస్ నిమ్మకాయల ప్రసాద్‌గారు ఫోన్ చేయటంతో చాలా హ్యాపీగా అనిపించింది. జూలై 28న మళ్లీ కలుద్దాం’’ అన్నారు.
నిర్మాత కిరణ్ కొర్రపాటి మాట్లాడుతూ ‘‘కాన్సెప్ట్, కథలోని ఎమోషన్స్ కనెక్ట్ కావటంతో మౌత్ టాక్ కారణంగా మ్యాట్నీ నుంచి సినిమాకు ఆదరణ పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు థియేటర్స్ సంఖ్య పెరిగింది. సినిమాకు వస్తున్న ఆదరణ చూస్తుంటూ చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి ఎమోషనల్ మూవీ అరుదుగా వస్తుంటుంది. ఇలాంటి సినిమాలను ఆదరిస్తే ఇండస్ట్రీలో, కొత్త దర్శకులకు ఇంకా మంచి ఉత్సాహం వస్తుంది. టీమ్ విషయానికి వస్తే హను , వివేక్, చరణ్ అర్జున్‌లకు థాంక్స్. డైరెక్టర్ శివ మంచి స్క్రిప్ట్‌తో నా దగ్గరకు వచ్చారు. మంచి టీమ్ సెట్ అయ్యింది. మంచి టీమ్‌ను సినిమా కథే సెలక్ట్ చేసుకుంది. మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ హనుమంతరావుగారికి థాంక్స్. జీస్టూడియోస్ నిమ్మకాయల ప్రసాద్‌గారు మంచి కథలను ఎంపిక చేసుకుని నడిపించారు. ఆయనకు ఈ సందర్భంగా థాంక్స్. ఆదిత్య మ్యూజిక్‌వారికి థాంక్స్’’ అన్నారు.
ధన్‌రాజ్ మాట్లాడుతూ ‘‘విమానం సినిమాను పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా థాంక్స్ చెబుతున్నాను. విమానం పైకి ఎగరానికి ఫైలట్ ఎంత ముఖ్యమో మనకు తెలుసు. అలాగే మా విమానం సినిమా ఇక్కడకు రావటానికి నిర్మాతలు కిరణ్‌గారు, జీ స్టూడియోస్, డైరెక్టర్ శివ ప్రసాద్‌గారు ఫైలట్స్‌లా వర్క్ చేశారు. ఇక మీడియా ఆటో ఫైలట్స్‌లా థియేటర్స్‌కి ల్యాండ్ చేశారు. మంచి సినిమాను ఆడియెన్స్‌కు చేర్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’’ అన్నారు.
రైటర్ హను మాట్లాడుతూ ‘‘విమానం సినిమాను ఆదిరించిన వారికి, ఆదరిస్తోన్న వారికి థాంక్స్. మనకు తెలియని జీవితాలు ఇందులో ఉన్నాయి. పిల్లలకు చూపించాల్సిన సినిమా ఇది’’ అన్నారు.
సినిమాటోగ్రాఫర్ వివేక్ మాట్లాడుతూ ‘‘విమానం సినిమాకు చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఫ్యామిలీ అంతా కలిసి సినిమా చూస్తున్నారు. అరుదుగా వచ్చే సినిమా. డైరెక్టర్ శివగారు కథ చెబుతున్నప్పుడే అది కనెక్ట్ అయ్యింది. ఇక నటీనటులు, టీమ్ నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లారు. ఇక కిరణ్‌గారు, ప్రసాద్‌గారు వెనకుండి మమ్మల్ని ముందుకు నడిపించారు’’ అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ మాట్లాడుతూ ‘‘విమానం సినిమాను చూసిన తర్వాత నా కొడుకు, కూతురు విమానం ఎక్కివ్వమని అంటున్నారు. నా పిల్లలకు ఆధార్ కార్డ్ లేకపోవటంతో వారిని విమానం ఎక్కించలేదు. అయితే నాకు మాత్రం విమానం సినిమా మ్యూజిక్ డైరెక్టర్‌గా ఆధార్‌కార్డుని ఇచ్చింది. విజయ్ కనకమేడల నాకు చాలా మంచి స్నేహితుడు.. రూమ్మేట్ కూడా. నాకు ఫోన్ చేసి విమానం సినిమా గురించి మాట్లాడారు. రెండు సినిమాలు చేసినప్పటికీ మ్యూజిక్ డైరెక్టర్‌గా నీ వైపు నేనెందుకు చూడలేదా అని నిపించేలా థియేటర్‌లో మ్యూజిక్ చేశావని అన్నాడు. అలాగే సముద్ర ఖనిగారు నాకు ఫోన్ చేసి మాట్లాడారు. నేను ఎలా బ్యాగ్రౌండ్ స్కోర్ చేశానని ఆయన మాట్లాడుతుంటే చాలా ఆనందమేసింది. చరణ్‌ని నేను చూసుకుంటానని నా భార్యతో మాట్లాడి ఆయనే ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా కిరణ్ అన్నకు థాంక్స్ చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభం నుంచి నన్ను ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. ఆయన నిర్మాతగా మారి నాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా అవకాశం ఇచ్చారు. ఇంత అద్భుతమైన సినిమాను ఇచ్చిన శివ ప్రసాద్‌గారికి థాంక్స్. చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను’’ అన్నారు.
డైరెక్టర్ శివ ప్రసాద్ యానాల మాట్లాడుతూ ‘‘విమానం సినిమాను చూసిన వారందరూ గొప్పగా చెబుతున్నారు. నాన్న ఒక గొప్ప హీరో. నేను రాసుకున్న వీరయ్య పాత్రకు సముద్ర ఖనిగారు, కొడుకు పాత్రకు ధ్రువన్, సుమతి పాత్రకు అనసూయ, కోటి పాత్రలకు రాహుల్ రామకృష్ణ, డేనియల్ పాత్రకు ధన్ రాజ్ .. ఇలా అందరూ ప్రాణం పోశారు. మా నిర్మాత కిరణ్‌గారికి, జీ స్టూడియోస్ ప్రసాద్‌గారికి థాంక్స్. నా కథను నమ్మి దర్శకుడిగా అవకాశం ఇచ్చి ఇక్కడ నిలబెట్టారు. ఆ కిక్‌ని ఫీల్ అవుతున్నాను. మా టెక్నికల్ టీమ్‌కు థాంక్స్. మా నాన్నగారు సినిమా చూశారు. ఎలా ఉంది నాన్నా అని అడిగితే.. మా నాన్న గుర్తుకొచ్చాడులేరా అని ఆయన, అలాగే మా అమ్మగారు కూడా చెప్పారు. చాలా ఆనందమేసింది’’ అన్నారు.
మాస్టర్ ధ్రువన్ మాట్లాడుతూ ‘‘ఇలాంటి సినిమాకు ప్రేక్షకులు ఎప్పుడూ ఇలాగే సపోర్ట్‌ను అందివ్వాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్స్ కిరణ్‌గారు, ప్రసాద్‌గారు దర్శకుడు శివ ప్రసాద్‌గారికి థాంక్స్. సముద్ర ఖనిగారికి, అనసూయగారికి థాంక్స్’’ అన్నారు.
అనసూయ భరద్వాజ్ మాట్లాడుతూ ‘‘మాకు ఈ సినిమా గురించి జబర్దస్త్ ప్రోగ్రామ్ డైరెక్టర్స్ నితిన్, భరత్‌గారు చెప్పారు. ఇలా మన టీమ్‌లో వర్క్‌చేసిన శివ ప్రసాద్‌గారి దగ్గర ఓ కథ ఉంది. మీరు వినాలన అన్నారు. జబర్దస్త్ నుంచే శివ ప్రసాద్‌గారు తెలుసు. ఆయన వచ్చి కథ చెప్పగానే ఏడ్చేశాను. నాకు మాతృదేవోభవ గుర్తొచ్చింది. నాన్నా మనందరి జీవితాల్లో తెలియని హీరో. అందుకనే ఈ సినిమాలో నేను భాగం కావాలని అనుకున్నాను. మనం అందరం ఎక్కడో ఒక దగ్గర పిల్లలం. అందుకనే ఈ సినిమాకు అందరం కనెక్ట్ అవుతాం. ఈ సినిమాలో నేను చేసిన సుమతి క్యారెక్టర్ నా కెరీర్‌లో డిఫరెంట్‌గా ఉంటుంది. మేం ఎంత నమ్మకంతో సినిమా చేశామో. అంతే నమ్మకంగా ప్రేక్షకులు రిసీవ్ చేసుకున్నారు. సముద్ర ఖనిగారు లేకపోతే ఈ మూవీ ఇంత గొప్పగా వచ్చుండేది కాదేమో. ధ్రువన్ చాలా నేచురల్ యాక్టర్. ఇక మా టెక్నికల్ టీమ్‌కు థాంక్స్. నిర్మాత కిరణ్‌గారు, ప్రసాద్‌గారు.. డైరెక్టర్ శివగారికి థాంక్స్’’ అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com