RRR నెగిటివ్ షేడ్స్‌లో నటించేది ఈ ఇద్దరే...
Send us your feedback to audioarticles@vaarta.com
ఓటమి ఎరుగని దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం RRR. ఇప్పటికే భారీ చిత్రాలతో ఇండియన్ రికార్డ్స్‌ను బద్దలు కొట్టిన జక్కన్న మరోసారి తన రికార్డులు తానే బద్దలు కొట్టుకునే దిశగా RRRను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో స్టార్ హీరోలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇద్దరూ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించి చిన్నపాటి అప్డేట్ వచ్చినా ఇటు మెగాభిమానులు.. అటు ఎన్టీఆర్ అభిమానులు.. జక్కన్న వీరాభిమానులకు పండుగే మరి. ఈ సినిమాకు సంబంధించి అప్డేట్ వచ్చి చాలా రోజులైంది. అయితే పుకార్లు మాత్రం కోకొల్లలుగా వచ్చాయి.
తాజాగా ఈ సినిమాకు సంబంధించి చిత్రబృందం డబుల్ సర్‌ఫ్రైజ్ ఇచ్చింది. ఇందులో ఒకటి ఎన్టీఆర్ సరసన నటించి ఎవరనే విషయం కాగా.. మరొకటి కీలక పాత్రల్లో ఎవరెవరు నటిస్తారనేది వివరాలు వెల్లడించడం. కాగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ బ్యూటీ ‘ఒలివియా మోరిస్’ నటించనుంది. మరోవైపు.. కీలక పాత్రల కోసంగాను ఇద్దరు హాలీవుడ్ నటీనటులను తీసుకుంటున్నట్లు వారి వివరాలతో చిత్ర యూనిట్ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.
ఇదే సర్‌ఫ్రైజ్..
ఆర్ఆర్ఆర్‌లో నెగెటివ్ షేడ్స్‌లో అనగా.. ‘స్కాట్’ పాత్ర కోసం ఐరిష్ నటుడు ‘రే స్టీవెన్సన్’ ను.. లేడీ విలన్ పాత్ర కోసం సీనియర్ నటి ‘ఆలిసన్ డూడి’ ని తీసుకుంటున్నట్లు ప్రకటించారు. కాగా.. ఆలిసన్ డూడి చాలా వరకు తెలియకపోవచ్చు గానీ.. సినీ ప్రియులకు మాత్రం సుపరిచితురాలే.. ఎందుకంటే ‘ఇండియానా జోన్స్’ ,‘టాఫిన్’, ‘మేజర్ లీగ్ 2’ వంటి సినిమాల్లో నటించిన ఈమె మంచి గుర్తింపు తెచ్చుకుంది. సో మొత్తానికి చూస్తే.. ఇప్పటి వరకూ ఎన్టీఆర్, చెర్రీ సరసన ఎవరు నటిస్తారు..? ఎవరు ఏ పాత్ర అనేది దాదాపు క్లారిటీ వచ్చేసినట్లే అన్న మాట. వీరితో.. ఇక జక్కన్న షూటింగ్ చెక్కుడు షురూ చేయడం ఆలస్యం మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com