'విశ్వామిత్ర' విలన్‌గా..
Send us your feedback to audioarticles@vaarta.com
'గీతాంజలి' లాంటి కామెడీ హారర్‌తో తెలుగు ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన దర్శకుడు రాజ్ కిరణ్. ప్రస్తుతం ఈ దర్శకుడు.. ‘విశ్వామిత్ర’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తమిళ నటుడు ప్రసన్న, నందితా రాజ్ జంటగా నటిస్తున్న ఈ చిత్రం ఇటీవలే తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది.
ఈ షెడ్యూల్‌లో ప్రసన్న, నందితపై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. హైదరాబాద్‌లో ఈ నెల 12నుంచి నెలాఖరు వరకు జరగబోయే తదుపరి షెడ్యూల్‌లో ప్రముఖ నటుడు అశుతోష్ రాణా కూడా పాల్గొంటున్నట్టు సమాచారం.
ఈ సినిమా గురించి దర్శకుడు రాజ్ కిరణ్ మాట్లాడుతూ.."ఈ సినిమాలో నందిత ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా నటిస్తోంది. మగవాళ్ళంటే అసలు పడని ఈ అమ్మాయికి.. ఆమె పనిచేసే కంపెనీలో బాస్‌గా అశుతోష్ రాణా నటిస్తున్నాడు.
తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను నవ్విస్తూనే, విలన్‌గాను మెప్పించే విధంగా అశుతోష్ పాత్ర ఉంటుంద”ని తెలిపారు. అలాగే.. యుఎస్, స్విట్జర్‌ల్యాండ్‌లో జరిగిన కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా ఈ థ్రిల్లర్ మూవీను తెరకెక్కిస్తున్నట్టు దర్శకుడు చెప్పుకొచ్చారు.
కిరణ్, మాధవి అద్దంకి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో విద్యుల్లేఖా రామన్, చమ్మక్ చంద్ర, గెటప్ శ్రీను సహాయక పాత్రలు పోషిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments