సందీప్ కిషన్ విలన్ ఎవరు
Send us your feedback to audioarticles@vaarta.com
సందీప్ కిషన్ హీరోగా రైటర్ రాజసింహ దర్శకత్వంలో ఒక్క అమ్మాయి తప్ప.. అనే చిత్రం రూపొందుతుంది. ఈ సినిమాకి చోటా కె నాయుడు, మిక్కీ జే మేయర్, అనిల్ అరసు ఇలా టాప్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. అయితే ఈ సినిమాలో విలన్ పాత్రలో భోజ్ పురి నటుడు రవి కిషన్ నటిస్తున్నాడట.
రేసుగుర్రం, కిక్ 2 సినిమాల్లో విలన్ గా నటించి మంచి క్రేజ్ ఏర్పరుచుకున్న రవి కిషన్.. సందీప్ కిషన్ సినిమాలో నటిస్తుండడంతో ఈ ప్రాజెక్ట్ పై ఆసక్తి పెరిగింది. ఈ చిత్ర దర్శకుడు రాజసింహా రుద్రమదేవిలో గోన గన్నారెడ్డి పాత్రకు తగ్గట్టు పదునైన సంభాషణలు అందించి చిత్ర విజయానికి తను ఓ కారణమయ్యాడు. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఒక్క అమ్మాయి తప్ప అంటున్న సందీప్ కిషన్ ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com