డ్ర‌గ్స్ కేసులో విల‌న్ అరెస్ట్‌

  • IndiaGlitz, [Tuesday,October 23 2018]

అజాజ్ ఖాన్‌.. హిందీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన న‌టుడు. స‌ల్మాన్ ఖాన్ బిగ్ బాస్ ద్వారా ఫేమ‌స్ కూడా అయ్యాడు. తెలుగులో దూకుడు, నాయ‌క్‌, బాద్‌షా చిత్రాల్లో న‌టించారు. సాధారణంగా సినిమాల్లో కంటే వివాదాల్లోనే అజాజ్‌ఖాన్ ఎక్కువ‌గా ఉంటాడు.

తాజాగా ఈ యువ న‌టుడుని డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశారు. 2.3 గ్రాములున్న 8 మాత్ర‌ల‌ను పోలీసులు ఈ న‌టుడి ద‌గ్గ‌ర గుర్తించారు. ఈ నిషిద్ధ ఉత్ర్పేర‌కాల‌తో పాటు, 2.2ల‌క్ష‌ల న‌గ‌దు, సెల్‌పోన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మ‌రి పోలీసులు అజాజ్‌ను కోర్టులో ప్రొడ్యూస్ చేయ‌బోతున్నారు. కోర్టు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోనుందో చూడాలి.