‘కేజీఎఫ్’ హీరో యశ్ తల్లిపై గొడవకు దిగిన గ్రామస్తులు
Send us your feedback to audioarticles@vaarta.com
‘కేజీఎఫ్’ హీరో.. కన్నడ స్టార్ యశ్ తల్లిపై ఆమె సొంత గ్రామస్తులంతా గొడవకు దిగారు. యశ్ తల్లి తమ పొలం నుంచి ఉన్న దారిని మూసివేయడంతో ఆ గ్రామానికి చెందిన రైతులంతా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు అదేమని ప్రశ్నించినా ఆమె ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. దీంతో ఆ గొడవ పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. యశ్ తల్లి పుష్పలత స్వగ్రామం కర్ణాటకలోని హాసన్ జిల్లా. అక్కడ యశ్ కుటుంబానికి సొంత ఇల్లు ఉంది. అయితే ఇటీవల యశ్ కుటుంబం హాసన్ సమీపంలోని తిమ్మాపుర గ్రామంలో ఇటీవల 80 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది.
అంత వరకూ బాగానే ఉంది కానీ ఆ 80 ఎకరాల పొలం నుంచి ఇతర రైతులకు తమ పొలాలకు వెళ్లాల్సిన బాట ఉంది. దానిని పుష్పలత మూసి వేయించడంతో గ్రామస్తులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఇదేమని ప్రశ్నించినా ఆమె వినలేదు. తమ పొలాలకు దారిని మూసివేశారంటూ గ్రామస్తులు యశ్ తల్లి పుష్పలతతో గొడవ పడ్డారు. వివాదం పెద్దది కావడంతో పాటు ఆమె వినే పరిస్థితి లేకపోవడంతో గ్రామస్తులు చేసేదేమీ లేక దుద్ద పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
80 ఎకరాలకు కంచె వేస్తే తమ పొలాలకు ఎలా వెళతామని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. గ్రామ పటంలో ఉన్నట్లు దారి వదలాల్సిందేనని డిమాండ్ చేశారు. తాతల కాలం నుంచి సాగు చేసుకొంటున్న భూముల్లోకి దారిని మూసివేయడం తగదని గ్రామస్తులు వాపోతున్నారు. ఈ విషయమై చర్చించేందుకు హీరో యశ్ మంగళవారం తిమ్మాపురకు వెళ్లారు. పోలీసులు ఇరువర్గాలను స్టేషన్‌కి పిలిపించి పంచాయితీ చేశారు. యశ్ వస్తున్నట్లు తెలిసి వందలాది మంది అభిమానులు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments