ఘోర రైలు ప్రమాదాన్ని తప్పించిన మహిళ.. చీర కొంగుతో వందల మందికి ప్రాణ భిక్ష
Send us your feedback to audioarticles@vaarta.com
రైల్వే ట్రాక్‌పై నడుస్తుండగా పట్టా విరిగిపోవడమో, లేదంటే మరేదైనా కారణం వల్ల రైలు ప్రమాదంలో వుందని తెలిస్తే... ఎరుపు రంగుతో వున్న ఏదైనా వస్త్రాన్ని తీసి పైలెట్‌కు సిగ్నల్‌గా చూపిస్తూ వందలాది మంది ప్రాణాలను కాపాడే సీన్లు మనం ఎన్నో సినిమాల్లో చూశాం. అలాంటిది ఆ తరహా ఘటన నిజంగా జరిగితే.. ఓ మహిళ సమయస్పూర్తి, సాహసం కారణంగా వందలమంది ప్రాణాలతో బయటపడ్డారు.
వివరాల్లోకి వెళితే.. ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం ఎటా జిల్లా అవగాడ్ మండలం గులేరియా వాసికి చెందిన ఓంవతీ దేవి ప్రతిరోజూ రైలు పట్టాల మీదుగా తన పొలానికి వెళ్లేది. అయితే ఓ రోజున తన పోలానికి వెళుతుండగా .. కుస్బా రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు విరిగి ఉండటాన్ని ఆమె గమనించింది. రైల్వే అధికారులకు సమాచారం అందించేంత సమయం లేదు. అంతేకాదు.. ఆ మార్గంలో ట్రైన్ వస్తున్నట్టు ఎక్కడో కూత వినిపిస్తోంది. ఆ టెన్షన్లో ఏం చేయాలో ఆమెకు అర్థం కాలేదు.
దీంతో రెండు నిమిషాలు ఆలోచించిన ఓంవతీ దేవికి ఓ ఐడియా వచ్చింది. రైలు పట్టాలు విరిగిపోయిన ప్రదేశం నుంచి కాస్త దూరం రైలు వస్తున్న వైపు ముందుకు వెళ్లింది. రెండు కొమ్మలను పాతిపెట్టి వాటికి తాను కట్టుకున్న చీరను విప్పేసి కట్టింది. పట్టాలకు ఎదురుగా ఎరుపు రంగు చీరను చూసిన లోకో పైలట్ రైలును నిలిపివేశాడు. అనంతరం కిందకి దిగి వివరాలు తెలుసుకున్నాడు.
ఆమె చేసిన సాహసాన్ని రైల్వే సిబ్బందితో పాటు ప్రయాణీలకు అభినందించారు. అంతేకాదు ఆమెకు కొంత నగదు అందజేశారు. ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలను, వీడియోను ఉత్తర్‌ప్రదేశ్‌కే చెందిన పోలీసు అధికారి సచిన్ కౌషిక్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com