విల్లేజ్ లవ్ స్టొరీ తో రారా వేణుగోపాల నూతన చిత్రం ప్రారంభోత్సవం
Monday, May 22, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
శరవణ క్రియేషన్స్ పతాకంపై శ్రీ భూమానంద సమర్పించు 'రారా వేణుగోపాల' నూతన చిత్ర ప్రారంభోత్సవం సోమవారం ఫిల్మ్ ఛాంబర్ లో ఘనంగా జరుపుకుంది. ఈ నూతన చిత్రానికి క్లాప్ ప్రతాని రామకృష్ణ గౌడ్ ఇవ్వగా, లయన్ సాయి వెంకట్ గౌరవ దర్శకత్వం వహించగా, ఎమ్ ఎల్ ఎ భాస్కర్ రావు గారు కెమెరా స్విచ్ ఆన్ చేసి ఆరంభించారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథి రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ వాసు మొదటి సారి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తనకు సినిమా పై మంచి పాషన్ ఉంది. కథకు విలువ ఇచ్చి సినిమాలు చేస్తే తప్పకుండా విజయం సాధిస్తాయి. ఈ సినిమా కూడా హిట్ అయ్యి పెద్ద నిర్మాతగా వాసు ఎదగాలని ఆశిస్తున్నా అన్నారు. హీరో విజయ్ కమిట్ అనే చిత్రం తో పరిచయం అయ్యాడు ఇది తనకు రెండవ సినిమా.. సినిమా టైటిల్ లొనే మంచి వైబ్రేషన్ ఉంది. దర్శకుడు కృష్ణ మంచి ఫైర్ తో ఉన్నాడు. కీర్తి అనే అమ్మాయి ఈ చిత్రానికి రైటర్ గా ఉండటం విశేషం. మా తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ లో మెంబెర్ అయిన ప్రతి ఒక్కరికీ మేము ఏ విషయం లోనైనా వెన్నంటే ఉంటామని ఈ సందర్భంగా తెలియచేస్తున్నా... అన్నారులయన్ సాయి వెంకట్.
ఇక అతిథిగా విచ్చేసిన తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ ఈ చిత్ర టైటిలే మంచి క్యాచీవ్ గా ఉంది ఒక టైటిల్ మరియు ట్రైలర్లే థియేటర్లు లకీ ఆడిన్స్ ను రప్పిస్తాయి. ఆ కోవకు చెందిందే ఈ నూతన చిత్రం. పెళ్లి చూపులు సినిమా అంతా పెద్ద విజయం సాధించసాలని ఆశిస్తున్నా అన్నారు. ఆంధ్రాపోరి చిత్రం తరువాత మంచి మెలోడీ పాటలను అందిచే చిత్రమిది. ఈ చిత్ర టైటిల్ సాంగ్ కూడా ప్రిపేర్ అవుతోంది. సినిమా కూడా తప్పకుండా విజయం సాధిస్తుందని ఆశిస్తున్నా అన్నారు సంగీత దర్శకుడు జ్యోష్య భట్ల. ఇక హీరో విజయ్, హీరోయిన్ శ్వేతా మాట్లాడుతూ మాకు ఈ సినిమా అవకాశాన్ని ఇచ్చిన దర్శక నిర్మాతలకు మా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం అని తెలిపారు.
జూన్ రెండవ వారం లో ఉభయ గోదావరి ప్రాంతాల్లో షూటింగ్ ప్రారంభించనున్నాం.. ఒక విల్లేజ్ లవ్ స్టొరీ తో కతాంశం ఉంటుందని దర్శకుడు కృష్ణ తెలిపారు.
చివరగా నిర్మాత వాసు మాట్లాడుతూ నేను ఈ సినిమా చేయడానికి ప్రోత్సహించింన ప్రతాని, సాయి వెంకట్, సుబ్బారెడ్డి గార్లకు నా కృతజ్ఞతలు. ఒక మంచి సినిమా ప్రేక్షకులకు అందిచాలనే ఉద్ధేశ్యం తో మేము రారా వేణుగోపాల చిత్రాన్ని చేస్తున్నాం కనుక మమ్మల్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నా అన్నారు. అమ్మాయిని అయిన నన్ను, నా కథను నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతల కు నా ప్రత్యేక కృతజ్ఞతలను తెలియచేస్తున్నా అని రచయిత కీర్తి తెలిపారు. విజయ్, శ్వత హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రానికి కథ : కీర్తి చౌదరి భోగవల్లి, సంగీతం: జ్యోష్య భట్ల, ఛాయా గ్రహణం: కుమార్ యాదవ్, ఎడిటింగ్: విశ్వనాధ్, స్టిల్స్: నాగార్జున, మేకప్: చరణ్, కో డైరెక్టర్: వేణు నానికురాకు, పాటలు: శ్రేష్ఠ, రామాంజనేయులు, రెహమాన్, పబ్లిసిటీ డిజైనర్: ఆర్.జి.బి. స్టూడియోస్, నిర్మాత: వాసు, కథనం, మాటలు దర్శకత్వం: క్రిష్ణ.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments