తెలుగు »
Cinema News »
పల్లెటూరి వాతావరణాన్ని సరికొత్తగా చూపించే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సోగ్గాడే చిన్ని నాయనా - నాగార్జున
పల్లెటూరి వాతావరణాన్ని సరికొత్తగా చూపించే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సోగ్గాడే చిన్ని నాయనా - నాగార్జున
Wednesday, January 13, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
కింగ్ నాగార్జున నటించి..నిర్మించిన చిత్రం సోగ్గాడే చిన్ని నాయనా. ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు కళ్యాణ్ క్రిష్ణ తెరకెక్కించారు. ఈ చిత్రంలో నాగార్జున సరసన రమ్యక్రిష్ణ, లావణ్య నటించారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున నిర్మించిన సోగ్గాడే చిన్ని నాయనా చిత్రాన్ని సంక్రాంతి కానుకగా ఈనెల 15న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా సోగ్గాడే చిన్ని నాయనా గురించి నాగార్జున తో ఇంటర్ వ్యూ మీకోసం..
మనం తర్వాత సోగ్గాడే చిన్ని నాయనా సినిమా చేయడానికి సంవత్సరంన్నర గ్యాప్ వచ్చింది కారణం..?
నాన్నగారి ఆఖరి సినిమా మనం సినిమాని క్లాసిక్ మూవీగా తీర్చిదిద్దాలని చాలా కష్టపడ్డాం. అనుకున్న విధంగా క్లాసిక్ మూవీగా నిలిచింది. ఆతర్వాత మనం సక్సెస్ ఎంజాయ్ చేసాం. ఆ టైంలోనే మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. కొంత గ్యాప్ తరువాత మళ్లీ మీలో ఎవరు కోటీశ్వరుడు సెకండ్ సీజన్ స్టార్ట్ చేసాం. ఈ టైమ్ లో ఊపిరి సినిమా చేయడానికి అంగీకరించాను. అయితే శ్రుతి హాసన్ డేట్స్ ప్రొబ్లమ్ వలన ఊపిరి 4 నెలలు వాయిదా పడింది. ఆ టైమ్ లో సోగ్గాడే చిన్ని నాయనా సినిమా ప్రారంభించాం. ఈ సినిమాని సెప్టెంబర్ లో రిలీజ్ చేయాలనుకున్నాం. అప్పుడు అఖిల్ మూవీ రిలీజ్ ప్లాన్ చేయడంతో సోగ్గాడు వాయిదా వేసాం. దసరాకి రిలీజ్ చేయాలనుకున్నాం. ఆఖరికి సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నాం.అందువలనే ఇంత గ్యాప్ వచ్చింది.
ఈ సినిమాలో తండ్రి కొడుకులుగా నటించారు కదా..ముందు తాత మనవడుగా అనుకున్నట్టున్నారు..?
అవును..ముందు తాత మనవడు గా చేయాలనుకున్నాం. అయితే ఆర్టిస్ట్ లు ప్రొబ్లమ్..మేకప్ ప్రొబ్లమ్..వస్తుందని తండ్రి కొడుకులుగా మార్చాం. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేయాలని ముందు అనుకోలేదు. అయితే విలేజ్ బ్యాక్ డ్రాప్ వచ్చి చాలా రోజులు అయ్యిందని చేసాం.విలేజ్ ని సరికొత్తగా చూపించాం.. ఫైనల్ గా చాలా బాగా వచ్చింది సినిమా.
ఈ సినిమాలో కొడుకు పాత్రకు ఇన్ స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా..?
ఈ సినిమాలో కొడుకు పాత్ర పేరు రామ్. పని తప్ప మరో ప్రపంచం తెలియదు. అతను కనుక మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రొగ్రామ్ కి వస్తే..అసలు మనీ గెలుచుకోలేడు. ఎందుకంటే..అతను ఏ పని చేస్తున్నాడో అది తప్ప ఇంకేమి తెలియదు. అలా ఉంటుంది రామ్ క్యారెక్టర్. పని తప్ప ఏది పట్టించుకోని వారు ఎలా ఉంటారో...మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రొగ్రామ్ కి వచ్చిన ఉమాకాంత్ ను చేసాను. అలా పని తప్ప మరో లోకం లేని వారు ఎలా ప్రవర్తిస్తారో తెలుసుకుని అలా చేసాను.
డైరెక్టర్ కళ్యాణ్ క్రిష్ణ గురించి..?
కళ్యాణ్ క్రిష్ణ చాలా మంచి రైటర్. డ్రామా పై మంచి పట్టు ఉంది. అలాగే మన నేటివిటీపై కమాండ్ ఉంది. మంచి టీమ్ తో సినిమాని తీసాడు. నాకు కొత్తవాళ్లతో చేయడం ఇష్టం. వాళ్లలో నన్ను కొత్తగా చూపించాలనే తపన ఉంటుంది. కళ్యాణ్ క్రిష్ణ మంచి డైరెక్టర్ అవుతాడు.
బంగార్రాజు క్యారెక్టర్ ఎలా ఉంటుంది..?
బంగార్రాజు బుల్లెటు పై వెళుతూ...అమ్మాయి కనపడితే సిగ్గుపడేలా ఏదొటి చెప్పనిదే వెళ్లడు. చాలా ఎంటర్ టైనింగ్ గా ఉంటుంది. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అందరికీ నచ్చేలా ఉంటుంది బంగార్రాజు క్యారెక్టర్.
సోగ్గాడు ప్రమోషన్ లో చైతు..అఖిల్ కూడా కనిపిస్తున్నారు..
పంచె కట్టులో నా లుక్ చైతన్య, అఖిల్ కి బాగా నచ్చింది. అయితే పంచె కట్టుకోండి సరదాగా ముగ్గురం కలసి ఇంటర్ వ్యూ చేద్దాం అన్నాను. ముగ్గురం కలసి ఇంటర్ వ్యూ చేసాం హ్యాఫీ.
ఈ సంక్రాంతికి నాలుగు సినిమాలు పోటీపడుతున్నాయి కదా...ఎంత వరకు కరెక్ట్..?
నా సినిమా కోసం నవంబర్ లో థియేటర్స్ బుక్ చేసాను. నా సినిమాతో పాటు మరో పెద్ద సినిమా వస్తుంది అనుకున్నాను. అలాగే ఒకటి చిన్ని సినిమా వస్తుందనుకున్నాను. సంక్రాంతికి నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సోగ్గాడు సినిమాని 500 థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నాం. మనం సినిమాని 600 ధియేటర్స్ లో రిలీజ్ చేసాం. ఈ పోటీ లేకుండా ఉండి ఉంటే మరో 100 థియేటర్స్ దొరికేవి. ఇప్పుడైనా ఏం ఫరవాలేదు రెండోవారం మరో 100 థియేటర్స్ పెంచుతాం. తమిళనాడు, కర్నాటక లో కూడా పండగ వచ్చిందంటే 5 సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. అలాగే గతంలో నాన్నగారు, రామారావుగారి టైంలో పండగ వచ్చిందంటే 2, 3 సినిమాలు రిలీజ్ చేసేవారు. అందుచేత ఇదేమి కొత్తకాదు.
మనం తర్వాత మళ్లీ సోగ్గాడే చిన్ని నాయనా కి మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ ని ఎంచుకోవడానికి కారణం..?
మనం సినిమాకి అనూప్ చాలా మంచి ట్యూన్స్ అందించాడు. అందుచేత ఈ సినిమాకి కూడా అనూప్ నే ఎంచుకున్నాం. అయితే ఈ సినిమా టైంలోనే అనూప్ మదర్ చనిపోయారు. వర్క్ చేయగలడా..లేదా వేరే ఎవరితోనైనా చేయిద్దామా అనుకున్నాం. అనూప్ కి ఒకటే చెప్పాను. వర్క్ లో పడితేనే ఆ బాధ నుంచి బయటకు రావచ్చని. నేను కూడా అలాగే నాన్న పోయిన తర్వాత మూడో రోజు నుంచి వర్క్ చేయడం ప్రారంభించాను. అలాగే అనూప్ నాలుగవ రోజు నుంచి వర్క్ చేయడం ప్రారంభించాడు.
రమ్యక్రిష్ణ తో వర్క్ చేస్తున్నప్పుడు అన్నమయ్య సినిమా గుర్తుకు వచ్చిందా..?
లేదు...హాలో..బ్రదర్ గుర్తుకు వచ్చింది. (నవ్వుతూ..)
అఖిల్ సినిమా రిజల్ట్ గురించి తెలిసిన తర్వాత ఏమనిపించింది..?
అఖిల్ సినిమాని వినాయక్ గారు ఆయనకి తెలిసింది బాగానే తీసారు. కాకపోతే రిజల్ట్ తెలిసన తర్వాత దాని నుంచి బయటకు రావడానికి వారం రోజులు పట్టింది. షాక్ అయ్యాను. ఎందుకనో ఆడియోన్స్ కనెక్ట్ కాలేదు.
అఖిల్ సినిమాని మీరే నిర్మించాలనుకున్నారు కదా..? రిజల్ట్ తెలిసన తర్వాత మీరే చేసుంటే బాగుండు అనిపించిందా..?
అఖిల్ సినిమాని ప్రొడ్యూసర్ బాగానే తీసారు. ఎందుకనో ఆడియోన్స్ కి నచ్చలేదు. అఖిల్, వినాయక్ ఇద్దరు కలసి అఖిల్ సినిమా చేయాలనుకున్నారు. నిన్నే పెళ్లాడతా, అన్నమయ్య సినిమాల తర్వాత క్రిష్ణవంశీ డైరెక్షన్ లో చంద్రలేఖ సినిమా చేసాను. ఇప్పుడు చూసినా చంద్రలేఖ బాగుంటుంది కానీ ఆడియోన్స్ కి ఎందుకు నచ్చలేదో ఇప్పటికీ అర్ధం కాలేదు. కొన్ని సినిమాలు అంతే..
అఖిల్ రెండో సినిమా గురించి..?
కథలు వింటున్నాం. ఇంకా ఏది ఫైనల్ కాలేదు. అయినా కంగారు ఏమీ లేదు. అఖిల్ అందరి హీరోలా కాకుండా కొత్తగా చేయమని చెబుతున్నాను. వాడు కూడా అదే ఆలోచనలో ఉన్నాడు. నేను కెరీర్ ప్రారంభించేటప్పటికే చిరంజీవిగారు, బాలక్రిష్ణ గారు స్టార్స్ గా ఉన్నారు. వాళ్లతో ఏ డైలాగులు చెప్పించారో..నాతోను అవే చెప్పించేవారు డైరెక్టర్స్. అలా కాదని చెప్పి...నేను ఏదో కొత్తగా చూపించాలని మణిరత్నం గారిని వెంటపడి మరీ గీతాంజలి సినిమా చేసాను. అప్పుడు యూత్ నన్ను అలా చూడాలనుకున్నారు. అలాగే అఖిల్ కూడా కొత్తగా ట్రై చేస్తాడు.
సంక్రాంతికి ఎలా సెలబ్రేట్ చేసుకునేవారు..?
చిన్నప్పుడు అమ్మమ్మ గారి ఊరు ఏలూరు దగ్గర దెందులూరు వెళ్లేవాళ్ళం. ఆతర్వాత పెద్దయ్యాక హైదరాబాద్ లో గాలిపటాలు ఎగరవేసేవాళ్లం. ఈ సంక్రాంతిని అన్నయ్య ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటాం.
ఊపిరి సినిమా షూటింగ్ ఎంత వరకు వచ్చింది..?
దాదాపు షూటింగ్ పూర్తయ్యింది. ఈ సినిమాలో అంతా వీల్ ఛైర్ లోనే కనిపిస్తాను. ఫీల్ గుడ్ మూవీ. తెలుగు, తమిళ్ లో రూపొందుతున్న ఈ సినిమాని రెండు భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం.
రాఘవేంద్రరావు గారితో భక్తిరస చిత్రం ఎప్పుడు..?
రాఘవేంద్రరావు గారు 20 నిమిషాల కథ చెప్పారు. చాలా బాగా నచ్చింది. స్ర్కిప్ట్ వర్క్ జరుగుతోంది. అంతా సెట్ అయ్యాకా ఎప్పుడు ప్రారంభిస్తామనేది ఎనౌన్స్ చేస్తాం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments