రూ.100 కోట్ల ఆఫర్ తిరస్కరణ.. థియేటర్లోనే సుదీప్ ‘‘విక్రాంత్ రోణా’’
Send us your feedback to audioarticles@vaarta.com
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈగ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు సుదీప్. ఆ తర్వాత బాహుబలి సినిమాలో గెస్ట్ రోల్లో కనిపించింది కాసేపైనా ఆకట్టుకున్నాడు. ఆ క్రేజ్‌తో ఇప్పుడు సుదీప్ నటించిన సినిమాలు తెలుగులో కూడా డబ్ అవుతున్నాయి. సుదీప్ నటిస్తున్న తాజా చిత్రం విక్రాంత్ రోణ. పోస్టర్స్, గ్లింప్స్‌తో అంచనాలను పెంచుతూ వచ్చిన ఈ త్రీడీ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 24న విడుదల చేయబోతున్నట్లు జాక్ మంజునాథ్ తెలియజేశారు. ఈ మూవీలో నిరూప్ భండారి, నీతా అశోక్, జాక్వలైన్ ఫెర్నాండెజ్ కీలక పాత్రలు పోషించారు.
విక్రాంత్ రోణకు ఓటీటీ వైపు నుంచి భారీ ఆఫర్ వచ్చిందనీ, దీంతో ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ద్వారానే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందనే వార్తలు కొన్ని రోజులుగా ఫిలింనగర్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో మేకర్స్ స్పందించి క్లారిటీ ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను ఫిబ్రవరి 24వ తేదీన థియేటర్లలో విడుదల చేయనున్నట్టు చెబుతూ, అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేశారు.
జీ స్టూడియోస్ సమర్పణలో నిర్మితమైన విక్రాంత్ రోణా మల్టిలింగ్వుల్ యాక్షన్ అడ్వంచర్. 14 భాషల్లో 55 దేశాల్లో త్రీడీ లో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకు అనూప్ భండారి దర్శకత్వం వహిస్తున్నారు. జాక్ మంజునాథ్, షాలిని మంజునాథ్ నిర్మాతలు. అలంకార్ పాండ్యన్ సహ నిర్మాత. బి.అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com