కారు యాక్సిడెంట్‌లో విక్ర‌మ్ త‌న‌యుడు

  • IndiaGlitz, [Sunday,August 12 2018]

హీరో విక్ర‌మ్ త‌న‌యుడు ధృవ్ ఇప్పుడు హీరోగా 'వ‌ర్మ' అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. బాలా ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం తెలుగు 'అర్జున్ రెడ్డి'కి రీమేక్ అన్న సంగ‌తి తెలిసిందే.

ప్ర‌స్తుతం సినిమా సెకండ్ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటుంది.ఈ కుర్ర హీరో ఆదివారం ఉద‌యం కారును డ్రైవ్ చేస్తూ చెన్నై తేనాంపేట‌లో ఆగి ఉన్న మూడు ఆటోల‌ను డీ కొట్టేశాడు.

ఈ ప్రమాదంలో ఎవ‌రికీ పెద్ద‌గా ఏ గాయాలు కాలేదు. అయితే ఈ ఘ‌ట‌న‌ పై పోలీసులు విచార‌ణ జ‌రుపుతున్నారు. ధృవ్ తెలుగులో శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో కూడా సినిమా చేయ‌బోతున్నాడు.