తేజ హీరోయిన్ లపై విక్రమ్ కన్ను
Send us your feedback to audioarticles@vaarta.com
దర్శకుడు తేజ రూపొందించే సినిమాలు సంచలనాలు సాధించినా.. తుస్సుమన్నా.. తను పరిచయం చేసే హీరోయిన్లకు మాత్రం మంచి భవిష్యత్తే ఉంటుంది. తేజ ఇంట్రడ్యూస్ చేసిన నాయికల్లో రీమాసేన్, అనిత, సదా, కాజల్, నందిత తమకంటూ ఓ క్రేజ్‌ని సొంతం చేసుకున్నారు కూడా. వీరిలో నందిత మినహాయిస్తే.. మిగిలిన వారంతా తమిళనాట కూడా హవా చాటుకున్నారు.
విశేషమేమిటంటే.. అలా తమిళ్‌లో చేసిన రీమాసేన్, అనిత, సదా.. తొలినాళ్లల్లోనే విక్రమ్ పక్కన నటించే అవకాశం పొందితే.. కాజల్ కాస్త ఆలస్యంగానే అతని పక్కన నటించేందుకు సిద్ధమైంది. 'ధూల్' కోసం రీమాసేన్, 'సమురాయ్' కోసం అనిత, 'అనియన్'(అపరిచితుడు) కోసం సదా.. ఇలా తేజ పరిచయం చేసిన హీరోయిన్స్ ఆయా చిత్రాల కోసం విక్రమ్ పక్కన జతకట్టారు. ఇప్పుడు కాజల్ కూడా 'మర్మ మనిదన్' కోసం విక్రమ్‌తో కలిసి నటించబోతోంది. తేజ హీరోయిన్స్‌తో నటించిన సందర్భాలలో విక్రమ్‌కి నెగెటివ్ రిజల్ట్స్ అయితే రాలేదు. ఈ నేపథ్యంలో కాజల్ కూడా కలిసొస్తుందేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com