విక్రమ్ సినిమాలో విలన్ గా...
Send us your feedback to audioarticles@vaarta.com
డిఫరెంట్ పాత్రలతో మెప్పించే హీరోల్లో చియాన్ విక్రమ్ ఒకడు. తమిళంతో పాటు తెలుగులో కూడా విక్రమ్ సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. ఇప్పుడు విక్రమ్ స్కెచ్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ జూలై నుండి హరి దర్శకత్వంలో `స్వామి 2` సినిమా చేయబోతున్నాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన స్వామి పెద్ద హిట్ అయ్యింది.
సామి సీక్వెల్గా రూపొందనున్న ఈ చిత్రంలో త్రిషతో పాటు కీర్తి సురేష్ కూడా హీరోయిన్గా నటించనుంది. ఈ సినిమాలో విలన్గా బాబీ సింహ నటించబోతున్నాడు. పార్ట్ 1లో కోటశ్రీనివాసరావు విలన్గా నటించాడు. కోట పాత్ర కంటే పది రెట్లు బలంగా, తెలివిగా ఉండేలా బాబీ సింహ పాత్రను హరి డిజైన్ చేశాడట. పోలీసు పాత్రలను చాలా పవర్ఫుల్గా తెరకెక్కించే దర్శకుడు హరి చేయనున్న మరో పోలీసు చిత్రమిది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com