సూర్యకి పోటీగా విక్రమ్?
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళ అనువాద చిత్రం శివపుత్రుడులో విక్రమ్, సూర్య పోటీపడి మరీ నటించారు. బాల దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఇద్దరికీ మంచి పేరు తీసుకువచ్చింది. ఆ తరువాత ఈ ఇద్దరు కలిసి నటించిన సందర్భం లేదు. అయితే వచ్చే సంక్రాంతికి మాత్రం తమ కొత్త చిత్రాలతో పోటీపడేందుకు సిద్ధమయ్యారు విక్రమ్, సూర్య. కాస్త వివరాల్లోకి వెళితే.. గతేడాది ఇంకొక్కడు చిత్రంతో సందడి చేసిన విక్రమ్.. ఈ ఏడాది మూడు చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఆ చిత్రాలే ధ్రువ నక్షత్రం, స్కెచ్, సామి స్క్వేర్.
వీటిలో స్కెచ్ ఈ ఏడాదే విడుదల కావాల్సింది. కొన్ని కారణాల వల్ల అది సాధ్యం కాలేదు. దీంతో.. 2018 పొంగల్‌కి ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. అయితే.. ఇదే పొంగల్ టైమ్‌లో సూర్య కొత్త చిత్రం తానే సేరంద కూట్టమ్ కూడా విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని చిత్ర బృందం చాలా రోజుల క్రితమే ప్రకటించింది. దీంతో.. విక్రమ్, సూర్య మధ్య పోటీ తప్పేలా లేదు. ఈ రెండు చిత్రాలతో పాటు విశాల్ నటించిన ఇరుంబు తిరై కూడా అదే సమయంలో రిలీజ్ కాబోతోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com