విక్రమ్ తెలుగు టైటిల్ అప్పుడేనట...

  • IndiaGlitz, [Sunday,June 19 2016]

చియాన్ విక్ర‌మ్ హీరోగా వి.ఆనంద్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో శిబు థ‌మీన్స్ నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం ఇరు ముగ‌న్‌. ప్ర‌స్తుతం సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. న‌య‌న‌తార‌, నిత్యామీన‌న్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని జూలై విడుద‌ల చేయాల‌నుకుంటున్నారు. అయితే తెలుగులో కూడా విక్ర‌మ్‌కు ఉన్న మార్కెట్ దృష్ట్యా తెలుగు, త‌మిళంలో సినిమాను విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. తెలుగు టైటిల్‌ను, సింగిల్ ట్రాక్‌ను ఈ నెల 30న సింగ‌పూర్‌లో జ‌ర‌గ‌నున్న సైమా అవార్డ్స్ వేడుక‌ల్లో విడుద‌ల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.