స్టార్ తనయుడి పెద్దమనసు
Send us your feedback to audioarticles@vaarta.com
సినిమా ప్రయాణంలో అప్పుడప్పుడు కొన్ని మేలు మజిలీలుంటాయి. తెలుగు సినిమా చరిత్రను రాయాల్సి వస్తే అర్జున్ రెడ్డిని తాకకుండా ముందుకు పోవడం అసాధ్యం. భాషాబేధాలను దాటుకుని అంత మంది దృష్టినీ ఆకర్షించింది ఆ సినిమా. ముద్దుల వల్ల ఆకట్టుకుందా.. హీరో పాత్ర వల్ల ఆకట్టుకుందా అనే డిస్కషన్ వేరు. అయితే బాక్సాఫీస్‌కు కాసుల గలగలలను వినిపించిందన్నది మాత్రం అంగీకరించాల్సిన వాస్తవం. ఈ సినిమా తమిళ రీమేక్‌గా వర్మ రూపొందింది. శివపుత్రుడు, అపరిచితుడు వంటి సినిమాలతో తెలుగువారికి బాగా పరిచయమైన విక్రమ్ తనయుడు ధ్రువ్ ఈ సినిమాతో హీరోగా పరిచయమవుతున్నారు.
ఈ సినిమాకు ఆయనకు అందిన పారితోషికాన్ని ఓ మంచి పనికి అందించి, తన పెద్ద మనసును చాటుకున్నాడు. ఇటీవల కేరళలో వరద భీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కేరళకు తనవంతు సాయంగా ఆయన తన తొలి పారితోషికం మొత్తాన్ని అందించారు. కేరళ సీఎంను కలిసి ఆయన ఈ మొత్తాన్ని చెక్కు రూపంలో ఇచ్చారు. ఈ సినిమా గ్యాప్‌లో విదేశాల్లో ఫిల్మ్ మేకింగ్ కోర్సు చేయనున్నారు ధ్రువ్. ఆ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓసినిమా చేస్తారని సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Diya Harini
Contact at support@indiaglitz.com
Comments