స్టార్ త‌న‌యుడి పెద్ద‌మ‌న‌సు

  • IndiaGlitz, [Tuesday,September 25 2018]

సినిమా ప్ర‌యాణంలో అప్పుడ‌ప్పుడు కొన్ని మేలు మ‌జిలీలుంటాయి. తెలుగు సినిమా చ‌రిత్ర‌ను రాయాల్సి వ‌స్తే అర్జున్ రెడ్డిని తాక‌కుండా ముందుకు పోవ‌డం అసాధ్యం. భాషాబేధాల‌ను దాటుకుని అంత మంది దృష్టినీ ఆక‌ర్షించింది ఆ సినిమా. ముద్దుల వ‌ల్ల ఆక‌ట్టుకుందా.. హీరో పాత్ర వ‌ల్ల ఆక‌ట్టుకుందా అనే డిస్క‌ష‌న్ వేరు. అయితే బాక్సాఫీస్‌కు కాసుల గ‌ల‌గ‌ల‌ల‌ను వినిపించింద‌న్న‌ది మాత్రం అంగీక‌రించాల్సిన వాస్త‌వం. ఈ సినిమా త‌మిళ రీమేక్‌గా వ‌ర్మ రూపొందింది. శివ‌పుత్రుడు, అప‌రిచితుడు వంటి సినిమాల‌తో తెలుగువారికి బాగా ప‌రిచ‌య‌మైన విక్ర‌మ్ త‌న‌యుడు ధ్రువ్ ఈ సినిమాతో హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు.

ఈ సినిమాకు ఆయ‌న‌కు అందిన పారితోషికాన్ని ఓ మంచి ప‌నికి అందించి, త‌న పెద్ద మ‌న‌సును చాటుకున్నాడు. ఇటీవ‌ల కేర‌ళ‌లో వ‌ర‌ద భీభ‌త్సం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కేర‌ళ‌కు త‌న‌వంతు సాయంగా ఆయ‌న త‌న తొలి పారితోషికం మొత్తాన్ని అందించారు. కేర‌ళ సీఎంను క‌లిసి ఆయ‌న ఈ మొత్తాన్ని చెక్కు రూపంలో ఇచ్చారు. ఈ సినిమా గ్యాప్‌లో విదేశాల్లో ఫిల్మ్ మేకింగ్ కోర్సు చేయ‌నున్నారు ధ్రువ్‌. ఆ త‌ర్వాత శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో ఓసినిమా చేస్తార‌ని స‌మాచారం.

More News

వెంకీ... సూప‌ర్ బిజీ!

హీరో వెంక‌టేష్ ఇప్పుడు సూప‌ర్ బిజీగా మారారు. తండ్రి రామానాయుడు చ‌నిపోయిన త‌ర్వాత దాదాపు ఏడాదిన్న‌ర‌కు పైగా గ్యాప్ తీసుకున్న ఆయ‌న తాజాగా

'ప‌డిప‌డిలేచే మ‌న‌సు' పూర్తి కావ‌చ్చింది

ప‌డి ప‌డి లేచే  మ‌న‌సు అన‌గానే శ‌ర్వానంద్ సినిమా గుర్తుకొస్తుంది. అందాల రాక్ష‌సి, కృష్ణ‌గాడి వీర‌ప్రేమ‌గాథ సినిమాల ద‌ర్శ‌కుడిగా గుర్తింపు తెచ్చుకున్న హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వం

చ‌ర‌ణ్ జోడీ వ‌చ్చేసింది!

చ‌ర‌ణ్ జోడీ కొత్త‌గా రావ‌డ‌మేంటి? అని అనుకుంటున్నారా..? వ‌చ్చింది కొత్త‌గానే. కాక‌పోతే పాత సినిమాలోకే. బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో

దేవ‌దాస్  సెన్సార్ పూర్తి, సెప్టెంబ‌ర్ 27న విడుద‌ల

నాగార్జున‌, నాని హీరోలుగా న‌టించిన సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుంది. 'U/A' స‌ర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. ఈ సినిమా సెప్టెంబ‌ర్ 27న విడుద‌ల కానుంది.

చెర్రీ భ‌య్యా... ద‌స‌రాకేనా?

రామ్‌చ‌ర‌ణ్... ద‌స‌రాకు విడుద‌ల చేస్తారు అని అన‌గానే అంద‌రికీ రెండు అనుమానాలు వ‌స్తాయి. వాటిలో ఒక‌టి 'సైరా'కి సంబంధించిందేనా?  రెండోది బోయ‌పాటి సినిమా ఫ‌స్ట్ లుక్కా?